MP Raghurama: దమ్ము దైర్యం అంటే ఈటల రాజేందర్ దే.. తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ను ఎదురించాడు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి తృణప్రాయంగా రాజీనామా చేశాడు. పదవిని గడ్డిపోచలాగా పడేశాడు. రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కొన్నాడు. కేసీఆర్ అండ్ కో వందల కోట్లు కుమ్మరించినా సరే వెనక్కి తగ్గలేదు. సై అంటే సై అన్నాడు. ప్రజల్లోకి వెళ్లి అభిమానంతో గెలిచాడు.అందుకే ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుపును అందరూ అభినందిస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ బ్యాచ్ కూడా తమ రెబల్ ఎంపీ రఘురామపై పడ్డారు. ఈటల మగాడు.. ధైర్యవంతుడు.. ఆరోపించడం కాదు.. దమ్ముంటే అలా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి గెలవాలని ఎంపీ రఘురామను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ధైర్యం ఉంటే నర్సాపురం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నినాదం మొదలుపెట్టారు.
అయితే ఈటల రాజేందర్ లాగా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఎంపీ రఘురామ.. వ్యాపారవేత్తగా.. అవసరార్థం రాజకీయాలు చేసే నేతగా.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే ఆశపడే పొలిటీషియన్ గా ఉన్నాడు. మొదట టీడీపీలో ఆ తర్వాత వైసీపీ ఎంపీగా గెలిచి ఇప్పుడు బీజేపీకి ఫేవర్ గా మారారు. ఈటల అంటే కమ్యూనిస్టు.. ఆయనది ఒకటే పార్టీ ఒకటే మాట అన్నట్టుగా ఉంటుంది. కానీ రఘురామ అలా నిలబడే మనిషి కాదన్నది వైసీపీ వర్గాల విమర్శ.
అందుకే అంతగా విమర్శిస్తున్న ఎంపీ రఘురామ దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తో పోటీ పడి నిలబడి గెలిచి అప్పుడు విమర్శలు చేయాలంటున్నారు. కానీ అది అసాధ్యం. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా పార్లమెంట్ స్పీకర్ అనర్హత వేటు వేయకుండా లాబీయింగ్ చేస్తూ తన ఎంపీ సీటును కాపాడుకుంటున్నారు రఘురామ. ఆయన రాజీనామా చేస్తారనుకోవడం కల్లే. చూద్దాం వైసీపీ కౌంటర్లకు ఎంపీ రఘురామ ఏం సమాధానం ఇస్తారో..