Tollywood: ఇండస్ట్రీ ఏదైనా.. బాషా ఏదైనా అభిమానులు ఒకేలా ఉంటారు. హీరోల పట్ల ఒకే రకం ప్రేమను చూపిస్తారు. అసలు తమ అభిమాన కథానాయకుడి సినిమా నుంచి వస్తోన్న క్రేజీ అప్ డేట్ లు ఏమున్నాయి ? అంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు టీజర్, ట్రైలర్ వచ్చినా.. తమ స్టార్ హీరో ఎలా ఉన్నాడు ? ఏ లుక్ లో కనిపించాడు ? అంటూ ఆరా ఇస్తారు.

అదే ఏ మల్టీస్టారర్ సినిమానో అయితే, తమ హీరోకి ఎన్ని క్లోజప్ షాట్ లు పడ్డాయి ? వేరే హీరోకి ఎన్ని క్లోజ్ షాట్స్ పడ్డాయి ? అసలు తమ హీరో పాత్ర ఏమిటి ? తమ హీరో ఎన్ని గెటప్ ల్లో కనిపించాడు ? అంటూ లెక్కలేసుకుని ఆనంద పడుతూ ఉంటారు. దీనికి తోడు తమ హీరో ఎన్ని డైలాగ్ లు చెప్పాడు ? వేరే హీరో ఎన్ని చెప్పాడు ? ఇలా అనవసరమైన ఇగోలకు పోయి అభిమానులు సోషల్ మీడియా వార్ కి కూడా దిగుతారు.
అందుకే భారీ చిత్రాలు, స్టార్ మేకర్స్ ఈ మధ్య తమ చిత్రాల ప్రచారం విషయంలో కొత్త పంథా అనుసరిస్తూ మొత్తానికి అందర్నీ సంతోష పెడుతున్నారు. ముఖ్యంగా హీరోల చేత పంచ్ డైలాగ్ లు చెప్పించడం లేదు. అయినా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ పని ఏమిటి ? అంటూ సాగుతున్నాయి ప్రమోషన్స్. అసలు విజువల్స్ తోనే టీజర్‌లను, ఫస్ట్ గ్లింప్స్ లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
అయితే డైలాగ్ లు పెట్టకపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తమ సినిమాలు విడుదల అవుతున్నాయి. టీజర్ లో డైలాగ్ లు పెడితే.. అన్ని భాషల్లోకి డైలాగ్ లను మార్చాలి. అందుకే, డైలాగ్ లు లేకుండా టీజర్‌లను, ఫస్ట్ గ్లింప్స్ లను రిలీజ్ చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా అందుకే డైలాగ్ లేకుండా రిలీజ్ చేశారు.
Also Read: Korean Remake: కొరియన్ సినిమా రీమేక్‌లో టాలీవుడ్ హాట్ భామలు.. టైటిల్ ఇదే!
ఇదే ఫార్ములాను మిగిలిన పాన్ ఇండియా సినిమాలు కూడా అనుసరించాయి. ‘కె.జి.యఫ్: చాప్టర్-2’ టీజర్ లో కూడా హీరోతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేదు. ఇక ఈ టీజర్ కి ఏకంగా 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘పుష్ప’లో ‘తగ్గేదేలే’ అనే మాట తప్ప మరో డైలాగ్ లేదు.
Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ మలినేని మూవీ లో హీరోయిన్ ఫిక్స్… ఎవరంటే ?