Life Abroad Reality Check: అమెరికా అంటే ఆశల స్వర్గం.. యూరప్ అంటే డబ్బుల రాజ్యం.. అక్కడికి వెళ్తే దండిగా సొమ్ములు సంపాదించుకోవచ్చు. ఉన్నత చదువులు చదవచ్చు. ఇంకా చాలా చేయొచ్చు.. అని మనవాళ్లు అనుకుంటారు. అందువల్లే విదేశాలకు వెళుతూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇక్కడ వాళ్ల గురించి బంధువులు ఇచ్చే బిల్డప్పులు మామూలుగా ఉండవు.
వెస్ట్రన్ దేశాలలో లైఫ్ స్టైల్.. ఎలా ఉంటుందో ఒకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం మీడియా విస్తృతి పెరిగిపోయిన తర్వాత తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా చాలామంది పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు.. ముఖ్యంగా అమెరికా.. యూరప్ కంట్రీలకు ఎక్కువగా వెళుతూ ఉన్నారు. ఇక్కడ నగదు విలువ మన దేశంతో పోల్చి చూస్తే ఎక్కువ. పైగా వేతనాలు కూడా ఎక్కువగా లభిస్తుంటాయి. అందువల్లే మనవాళ్లు ఈ దేశాలకు వెళ్లడానికి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అక్కడ సదుపాయాలు.. షరతులు.. ఇవన్నీ కూడా కఠినంగా ఉంటాయి. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అక్కడికి వెళ్లిన వారిని అడిగితే తెలుస్తుంది. అలా అమెరికా వెళ్ళిన వారిలో మన దేశం నుంచి ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. తమ పిల్లల్ని చూసేందుకు వెళ్లిన వారికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయో.. సోషల్ మీడియాలో పంచుకున్నారు
ఆ దంపతులు తమ పిల్లలు అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో సియాటెల్ ప్రాంతంలో ఉంటే చూసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లే ముందు అతడు తన భార్యకు శ్వాస కోశ సంబంధిత సమస్య ఉంటే మందులు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మందులు పూర్తయ్యాయి. మళ్లీ ఆమెకు శ్వాస కోశ సమస్య ఎదురయింది.. అక్కడ మందులు మన మాదిరిగా లభించవు. పైగా పల్మనాలజిస్టును కలవాలి అంటే .. ముందుగా జనరల్ ఫిజిషియన్ ను కలవాలి. డాక్టర్ ను కలవడానికి వారం రోజులపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అపాయింట్మెంట్ దొరికినప్పటికీ.. జనరల్ ఫిజీషియన్ కేవలం వీడియో కాల్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి భార్యాభర్తల మందులను గురించి చెబితే.. దానికి తగ్గట్టుగా మందులు రాశాడు ఆ మందులను మెడికల్ స్టోర్లో తీసుకోవచ్చని సూచించాడు. వీళ్లు ఆ చీటిని పట్టుకొని మందుల షాపుకి వెళ్తే.. అక్కడ మందులు లేవు. పైగా రావడానికి చాలా రోజులు సమయం పడుతుందని చెప్పారు . ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ మందులు వీళ్లకు ఇచ్చారు. అయితే ఆ మందులను సిప్లా కంపెనీ తయారు చేయగా.. దానిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది.
ఆ మందుల మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడంవల్ల 50 శాతం రాయితీ వచ్చింది.. అయినప్పటికీ మందులకు వాళ్లు 21000 కట్టాల్సి వచ్చింది.. మన దేశంలో అయితే కేవలం రెండువేలల్లోనే లభించేవి. అమెరికాలో 42 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.. మనదేశంలో చాలామంది వైద్య సదుపాయాలు బాగోవు అంటారు. జీవితాన్ని ఆస్వాదించడం కష్టము అంటారు.. కానీ ఆ వ్యక్తి రాసుకొచ్చిన తన అనుభవాన్ని చదివితే కచ్చితంగా అమెరికా కంటే.. యూరప్ దేశాల కంటే.. భారత్ కొన్ని కోటి రెట్లు మిన్న. అభివృద్ధి చెందిన దేశాలలో అన్ని విపరీతమైన ఖర్చుతో కూడుకొని ఉంటాయి. డాటా కోసం వేలబ్ఖర్చు పెట్టాలి. ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడే అవకాశం ఉండదు. అయితే ఆఫీస్ లేదా ఇల్లు.. ప్రజా రవాణా సదుపాయం ఉండదు. మనుషులు తక్కువ.. భూమి ఎక్కువ.. ఇలాంటి చోట భారతీయులు బతకలేరు. ఒకవేళ వాళ్ళు బతికినా.. జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండలేరు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.. కాకపోతే నేటి తరం డబ్బు పిచ్చితో వెర్రి వేషాలు వేస్తోంది. కాబట్టి వాళ్లకు ఇండియా కంటే.. వెస్ట్రన్ దేశాలే గొప్పగా ఉంటాయి.
