LIC:మహిళలకు ఆర్థికంగా సాయపడేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. వారు వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోపథకాలను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని కేంద్రప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎందరో మహిళలు లబ్ధి పొందవచ్చు. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీమా సఖీ యోజనను ఇటీవల ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించే లక్ష్యంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. గ్రామీణ మహిళలకు బీమా ఏజెంట్లుగా మారి, జీవనోపాధి పొందేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో బీమా గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక సంవత్సరం లోపు 1,00,000 బీమా సఖీలను చేర్చుకోవడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన గ్రామీణ మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా భారతదేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో బీమా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. సాంఘిక సంక్షేమాన్ని వ్యాపార వృద్ధిని పెంచుతుంది. గ్రామాల్లోని ఉన్న మహిళలకు ఆర్థికంగా ఎంతో చేయూతను ఇస్తుంది.
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన పథకానికి కనీసం 10వ తరగతి అయిన పూర్తి చేసి ఉండాలి. ఈ ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన పథకానికి మహిళల వయస్సు 18 నుంచి 70 ఉండాలి. ఈ మహిళా సాధికారత డ్రైవ్‌లో భాగంగా రాబోయే 12 నెలల్లో 1,00,000 బీమా సఖీలను చేర్చనున్నారు. మూడు సంవత్సరాల వ్యవధిలో 200,000 మందిని నమోదు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకంలో పాల్గొనే మహిళలకు పాలసీ విక్రయాల ద్వారా వచ్చే కమీషన్‌లతో పాటు మొదటి మూడేళ్ల పాటు నిర్ణీత స్టైఫండ్ అందిస్తారు. మొదటి సంవత్సరంలో మహిళలకు నెలకు రూ.7,000 స్టైఫండ్ ఇస్తారు. రెండవ సంవత్సరంలో రూ. 6,000, మూడవ సంవత్సరంలో రూ. 5,000 ఇస్తారు. లక్ష్యాలను అధిగమించిన మహిళలకు అదనపు కమీషన్ ఆధారిత ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలనే ఉండదు. మహిళలకు నచ్చిన విధంగా పనిని చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఈ పథకంలో పాల్గొన్న ఏజెంట్లకు కూడా శిక్షణా కార్యక్రమాలు ఎల్‌ఐసీ అందిస్తుందట.
ఈ బీమా సఖీలు అనే ప్రోగ్రామ్ మూడేళ్ల పాటు ఉంటుంది. ఇందులో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీళ్లను బీమా సఖీలు గ్రాడ్యుయేట్లు అని పిలుస్తారు. వీరు ఎల్‌ఐసీ ఏజెంట్‌లుగా పని చేసే అవకాశాన్ని కూడా ఇస్తోంది. కంపెనీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ పాత్రలకు కూడా వీరు అర్హులు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ పథకానికి వయస్సు, సర్టిఫికేట్లు, వివరాలతో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఏజెంట్లుగా ఉన్నవారు అర్హులు. అయితే పదవి విరమణ పొందిన వారు వీటికి అనర్హులు. ఈ పథకానికి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి.