Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం

Leena Manimekalai : దేవుళ్లతో ఛాందసవాదులు గేమ్స్ ఆడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హిందూదేవుళ్లపై ఏమైనా చేసుకోవచ్చన్న మదం వారి తలకెక్కింది. ఈ మధ్య ఓ మతం ప్రవక్తపై అనుచితంగా మాట్లాడిన వ్యక్తిని కొందరు దుండగులు తలనరికి చంపారు. అయినా కూడా ఈ మత మౌఢ్యం పోవడం లేదు. ఇప్పటికే ‘కాళీ మాత నోట్లో సిగరెట్’ పెట్టి పెనుదుమారం రేపిన తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ ‘లీనా మణిమేఖలై’ తాజాగా మరో దుమారం రేపారు. ఇప్పటికే కాళీ మాతను […]

Written By: NARESH, Updated On : July 7, 2022 4:07 pm
Follow us on

Leena Manimekalai : దేవుళ్లతో ఛాందసవాదులు గేమ్స్ ఆడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హిందూదేవుళ్లపై ఏమైనా చేసుకోవచ్చన్న మదం వారి తలకెక్కింది. ఈ మధ్య ఓ మతం ప్రవక్తపై అనుచితంగా మాట్లాడిన వ్యక్తిని కొందరు దుండగులు తలనరికి చంపారు. అయినా కూడా ఈ మత మౌఢ్యం పోవడం లేదు. ఇప్పటికే ‘కాళీ మాత నోట్లో సిగరెట్’ పెట్టి పెనుదుమారం రేపిన తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ ‘లీనా మణిమేఖలై’ తాజాగా మరో దుమారం రేపారు. ఇప్పటికే కాళీ మాతను అవమానించినందుకు లీనాపై హిందూ సంఘాలు, సంస్థలు మండిపడుతున్నాయి.

ఈ వివాదం నడుస్తున్న వేళ.. లీనా మణిమేఖలై మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటికే ‘కాళీమాత’ సిగరెట్ వివాదం దేశమంతా భగ్గుమంటుంటే.. అది చాలదన్నట్టు ‘శివుడు, పార్వతి’ వేషంలో ఉన్న ఇద్దరు సిగరెట్ తాగుతున్న ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి అగ్గిరాజేసింది. లీనా హిందూ దేవుళ్లు , హిందూ మనోభావాలు దెబ్బ తీయాలని కంకణం కట్టుకుందని సోషల్ మీడియాలో ఆమె మీద మండిపడుతున్నారు.

ఇప్పుడు హిందూ సంఘాలు, పార్టీలు, గ్రూపులు అన్నీ లీనా మణిమేఖలై వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా లీనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ‘శివపార్వతుల’ వేషధారుణులు సిగరెట్ తాగుతున్న ఫొటోను షేర్ చేసి మరింతగా అగ్నికి ఆజ్యం పోసింది.

ఎవరి మనోభావాలు దెబ్బతిన్న పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతాయి. కానీ హిందువుల మనోభావాల విషయంలో మాత్రం ఈ శీతకన్ను ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలో ఉండడంతో కాస్తంత వేడి రాజుకుంటోంది. ఇదే వేరే వాళ్లు ఉంటే అసలు హిందువుల మనోభావాలకే విలువ లేకుండేది. హిందూ దేవుళ్లతో గేమ్స్ ఆడుతున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.