నేతలు, కరోనాపై సోనూ సూద్ తీవ్రవ్యాఖ్యలు

దేశంలో కరోనా పరిస్థితులు చూసి రియల్ హీరో సోనూ సూద్ కలత చెందారు. ఈ సందర్భంగా రాజకీయ నేతల తీరుపై తొలి సారి తీవ్ర విమర్శలు చేశారు.దేశంలో కరోనా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. సోనూ సూద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపెరగకుండా సామాన్యులు, పేదలు, పెద్దలకు కూడా సాయం చేస్తూ సోనూ సూద్ దేశంలో రియల్ హీరోగా మారాడు. సోనూ సూద్ సేవనిరతిపై ప్రశంసలు […]

Written By: NARESH, Updated On : May 24, 2021 5:33 pm
Follow us on

దేశంలో కరోనా పరిస్థితులు చూసి రియల్ హీరో సోనూ సూద్ కలత చెందారు. ఈ సందర్భంగా రాజకీయ నేతల తీరుపై తొలి సారి తీవ్ర విమర్శలు చేశారు.దేశంలో కరోనా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. సోనూ సూద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపెరగకుండా సామాన్యులు, పేదలు, పెద్దలకు కూడా సాయం చేస్తూ సోనూ సూద్ దేశంలో రియల్ హీరోగా మారాడు. సోనూ సూద్ సేవనిరతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కూడా తన సాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు.

తాజాగా ఇంటర్వ్యూలో సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అది చూసి తాను చలించిపోయినట్లు తెలిపారు.

దేశంలో సెకండ్ వేవ్ లో ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు పడుతున్న బాధలు తనను ఆవేదనకు గురిచేశాయి. ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయారు. ఆ కన్నీళ్లు చూస్తుంటే ‘నా తల్లిదండ్రులు సరైన సమయంలోనే చనిపోయారని భావిస్తున్నాను. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు బతికి ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురైతే ఆస్పత్రులల్లో బెడ్స్ దొరక్క .. ఆక్సిజన్ దొరక్క వాళ్లు పడే ఇబ్బంది చూసి నా హృదయం ముక్కలయ్యేది’ అని సోనూ సూద్ భావోద్వేగంతో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలని సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.