Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao : రామోజీరావు దైవాంశ సంభూతుడు.. ఆయనకు చట్టాలు వర్తించవు

Ramoji Rao : రామోజీరావు దైవాంశ సంభూతుడు.. ఆయనకు చట్టాలు వర్తించవు

Ramoji Rao : మార్గదర్శి విషయంలో జగన్మోహన్ రెడ్డి మరింత కఠినంగా వెళ్తున్నాడు. చంద్రబాబు కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆర్థిక స్తంభాలను కూలగొట్టే పనిలో ఉన్నాడు. బహుశా ఇప్పటికి ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకోకపోవచ్చు గాని.. మొత్తానికయితే ఎన్నికలు సమీపించే నాటి వరకు గెలుకుతూనే ఉంటాడు. సిఐడి అధికారులతో తనిఖీలు చేయిస్తూనే ఉంటాడు.. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డి లేదా సిబిఐ అధికారులకు అప్పగించడు. ఇది ఇప్పటివరకు కనిపించిన కోణం.. కానీ జగన్ బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు రామోజీరావు మళ్ళీ తనకు అలవాటైన ఏపీ జనం సహాయం తీసుకుంటున్నాడు. తన సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య అయినట్టు కలరింగ్ ఇస్తున్నాడు.

ఈరోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే ఇది మరింత అర్థవంతంగా బోధపడుతుంది. ఎందుకంటే ఈనాడు రామోజీరావు పై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఏకంగా హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి ప్రధానికి లేఖ రాశాడు అంటూ ఒక వార్త కనిపించింది. దాని కింద మాజీ సైనిక ఉద్యోగులు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి.. జగన్ మంచివాడు కాదు, రామోజీరావు అనేవాడు సుద్దపూస, ఈనాడు అనేది భగవద్గీత అనే రేంజ్ లో మాట్లాడినట్టు ఈనాడు అచ్చేసుకుంది. రేపు మాపో ఈనాడు ఉద్యోగులతో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే మామూలు వ్యక్తి కాదు. చిట్ ఫండ్ వ్యాపారం గురించి, దానికి సంబంధించిన చట్టాల గురించి బాగా తెలిసిన వారితో ఒక లేఖ రాయించిన బాగుండేది. అంటే ప్రధాని హిందుత్వ వాది కాబట్టి, హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి తో లేఖ రాస్తే మోదీ వెంటనే జగన్ ను ఆదేశిస్తాడు, మార్గదర్శి మీద చర్యలు తీసుకోకుండా ఊరుకుంటాడు అనేది రామోజీరావు ఉద్దేశం కాబోలు. సాధారణంగా మేనేజ్మెంట్ కష్టాల్లో ఉన్నప్పుడు రిపోర్టర్ తో అనుకూలంగా వార్తలు రాయిస్తారు. వారే సమాచారం ఇచ్చి, వారే ప్రకటన రాస్తారు. తెలుగునాట ఇదేమి కొత్త కాదు. గతంలో సాక్షి ఇదే తీరును ప్రదర్శించింది. ఆంధ్రజ్యోతి కూడా ఇదే విధానాన్ని అవలంబించింది.. ఇప్పుడు కొత్తగా ఈ పల్లవిని ఈనాడు అందుకుంది. తన దాక వస్తే గాని రామోజీరావుకు అర్థం కానట్టుంది.

ఇక్కడ హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. మార్గదర్శిలో ఎంత మంది సిబ్బంది ఉంటారు? దాని టర్న్ ఓవర్ ఎంత? ఎంతమంది చిట్టి వేశారు? ఎంత కాలం నుంచి ఈ వ్యాపారం సాగుతోంది. ఈ విషయాలు మొత్తం హిందూ మహాసభ చెప్పింది. ఇలాంటి లెక్కలు మొత్తం మార్గదర్శి సీఈవో చెప్పాలి. ఆ బాధ్యతను హిందూ మహాసభ తీసుకుంది. అసలు ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయింది. ఇప్పటికి ఉండవల్లి అడిగినవి రెండే రెండు ప్రశ్నలు.. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారంలో 22 రకాల బంధువుల నుంచి తప్ప ఇతరుల నుంచి డిపాజిట్లు వసూలు చేయరాదు. పండు వ్యాపారం చేసేవారు ఇతర వ్యాపారం చేయకూడదు. కేంద్ర ప్రభుత్వ చిట్ ఫండ్ చట్టంలో ఈ రెండు కూడా ఉన్నాయి. కానీ ఈనాడు, సో కాల్డ్ కమ్మీలు, టిడిపి నాయకులు ఇస్తున్న కలరింగ్ ఎలా ఉందంటే “వారు ఈ భూమిపై ఇంకా నివసిస్తున్నారు అంటే అది రామోజీ వల్లనే. ఆయన ధరించే దుస్తులు ఎంత తెల్లవో, హృదయం కూడా అంతే తెల్లనిది. నా లోక కళ్యాణ కోసమే ఊపిరి తీసుకుంటున్నారు. మార్గదర్శి లేకపోతే తెలుగు ప్రజలు నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు. ఉద్యోగులను ఆయన కన్నబిడ్డల్లా చూసుకుంటారు” అంటూ డప్పు కొడుతున్నారు.

అసలు వారంతా కూడా ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు డిపాజిట్లు అసలు చేయవచ్చా? ఈ వ్యాపారంలో ఉన్నవారు ఇంకో వ్యాపారం చేయవచ్చా? అసలు చట్టం ఏం చెబుతోంది? తుచ్చమైన మానవులకు వర్తించే చట్టాలు రామోజీరావు కు కూడా వర్తిస్తాయా?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఇక చర్చే ఉండదు. సిఐడి దాడులు అసలు ఉండవు. ఏం చక్కా చరమాంకంలో కూడా రామోజీరావు దర్జాగా ఓం సిటీ కట్టుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular