UP Elections 2022: ఉత్తరప్రదేశ్ లో చివరిదశ పోలింగ్ నేడు జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. నేటితో జరిగే పోలింగ్ తో అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరి ఫోకస్ వీటిపైనే పడింది. ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు తమ ప్రభావం చూపించాలని అన్ని ప్రయత్నాలు చేశాయి.
ఓటరు మాత్రం ఎవరిని గెలిపిస్తారో? ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియడం లేదు. ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీ, ఎస్పీ మధ్యే పోటీ ప్రధానంగా ఉంటుందని చెబుతున్న క్రమంలో ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల ప్రచారానికి వచ్చిన బెంగాల్ సీఎం దీదీ తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆందోళన చెందారు. దీనిపై విచారణ జరిపించాలని టీఎంసీ ఫిర్యాదు చేయడం తెలిసిందే.
చివరి దశ పోలింగ్ కావడంతో అందరి జాతకాలు బయటపడే అవకాశాలున్నాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ నేతలు ఎవరికి వారే తమ గెలుపు ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధికారం తమదంటే తమదేనని చెబుతున్నారు. కానీ ఓటరు మదిలో ఏముందో తెలియడం లేదు. చివరి దశ ఓటింగ్ పూర్తికావడంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఫోకస్ చేస్తున్నాయి.
యూపీతోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల తంతు నేటితో పూర్తి కానుంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి.కానీ విజయం ఎవరిదో మాత్రం అర్థం కావడం లేదు. భవిష్యత్ లో జరిగే ఎన్నికలకు ఇవి రెఫరెండంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో అయిదు రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయ తీరాలను చేరుకుంటుందో అని ఓటర్లు కూడా ఎదురుచూస్తున్నారు.
చివరి దశ పోలింగ్ లో మోడీ నియోజకవర్గం వారణాసి, అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అజర్ గడ్ నియోజకవర్గాల్లో ఎవరిది పైచేయి అవుతుందో అనే సంశయాలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించాలంటే ఇందులో కచ్చితంగా విజయం సాధించాలని అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి.