Lakshmi Parvathi- Balakrishna: వీలు దొరికితే బాలయ్యను ఏకిపారేసేందుకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సిద్ధంగా ఉంటారు. వైసీపీ ప్రభుత్వ సానుభూతిపరురాలైన లక్ష్మీ పార్వతి వై ఎస్ జగన్ ని విమర్శిస్తే ఊరుకోరు. ముఖ్యంగా నందమూరి, నారా కుటుంబాలపై విరుచుకుపడుతుంది. తాజాగా ఆమె బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర మీద కీలక ఆరోపణలు చేశారు. బాలయ్య తన బావ మాటలు విని పాడైపోతున్నాడని ఎన్టీఆర్ అనేవాడని ఆమె అన్నారు. కూతురు బ్రాహ్మణిని నారా చంద్రబాబు కొడుకు లోకేష్ ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించాను అన్నారు. ఎందుకు లోకేష్ కి ఇచ్చి ఆ పిల్ల గొంతు కోస్తున్నావని అడిగాను, అన్నారు.
ఇక వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బాలయ్యకు లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. బాలకృష్ణ, వసుంధర, బాలకృష్ణ పీఏ హిందూపురాన్ని దోచుకుంటున్నారని అన్నారు. వసుంధర డబ్బులతో బస్సులో పారిపోయింది నిజం కాదా అన్నారు. ఎన్టీఆర్ కొడుకు అని ప్రజలు నిన్ను గెలిపించారు. వాళ్లకు ఎలాంటి మంచి నువ్వు చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం వలన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని బాలకృష్ణపై లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు.
లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ రెండో భార్య అన్న విషయం తెలిసిందే. లక్ష్మీ పార్వతి పార్టీపై ఆధిపత్యం సాధిస్తుందనే నెపంతో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సహాయంతో పార్టీని, సీఎం పదవిని హస్తగతం చేసుకున్నాడు. సీఎం పదవి దూరమైన కొన్ని నెలలకు ఎన్టీఆర్ గుండెపోటుతో నివాసంలో మరణించారు.
లక్ష్మీ పార్వతి అనంతరం ఎన్టీఆర్ పేరున ఓ రాజకీయ పార్టీ పెట్టారు. దానికి ఆదరణ దక్కలేదు. అప్పటి నుండి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వైసీపీ పార్టీ స్థాపించాక వైఎస్ జగన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. చెప్పాలంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ గా ఆమె ఉన్నారు. ఆమెకు ఆ పార్టీలో సముచిత స్థానం ఉంది.