Lakshmi Parvathi: అల్లుడు చంద్రబాబు.. మామ ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటును తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అయితే ఇప్పటికీ రాచపుండును పొడిచినట్టు మంటపెడుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ వర్ధంతి జయంతిలప్పుడు చంద్రబాబును తిట్టి పోస్తుంటుంది. 1996లో సీఎం పోస్ట్ కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు సొంతం. అందుకే చంద్రబాబు పొడగిట్టని లక్ష్మీపార్వతి.. ఆయన ప్రత్యర్థి అయిన జగన్ పంచన చేరింది. వైసీపీ తరుఫున ప్రచారం చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్మన్ గా కొనసాగుతోంది.

నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. నేడు జగన్ ఆ పనిచేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని.. ‘వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా మార్చేశారు. దీంతో కక్కలేక మింగలేని వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమాన నేతలంతా రాజీనామాల బాట పడుతున్నారు. ఇప్పటికే అధికార తెలుగు భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ దీనికి నిరసనగా రాజీనామా చేసిపడేశారు. ఇక ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీపార్వతి కూడా రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి.
తన భర్త పేరును తీసేయడాన్ని లక్ష్మీపార్వతి అస్సలు జీర్ణించుకోవడం లేదట.. నాడు చంద్రబాబు చేసిన పనే.. నేడు జగన్ చేసేసరికి ఆమె ఆవేదన అంతా ఇంతాకాదు.. మీడియాను ఫేస్ చేయడం లేదు. ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని పరిస్తితి. జగన్ ను నమ్మి మోసపోయానా? అన్న ఆవేదన ఆమెను వెంటాడుతోంది.

అందుకే జగన్ ఇచ్చిన పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయిన లక్ష్మీపార్వతి చూపు.. ఇప్పుడు జనసేన వైపు పడుతున్నాయి. ఇటు టీడీపీలో చేరే అవకాశం లేదు. ఇప్పుడు వైసీపీకి ఆమె రాజీనామా చేసింది.. సో మిగిలిన ఏకైక ఆప్షన్ అయిన జనసేన వైపు లక్ష్మీపార్వతి చూపు పడినట్టు సమాచారం. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు మార్పుపై మొదట స్పందించింది పవన్ కళ్యాణ్. దీనిపై పోరుబాటుకు ఆయన పిలుపునిచ్చాడు. దీంతో పవన్ పార్టీలో చేరాలని లక్ష్మీపార్వతి డిసైడ్ అయినట్టు సమాచారం.