Kumbhakarna: పురాణాల్లో కుంభకర్ణుడు అంటే మంచి భోజన ప్రియుడు, నిద్ర ప్రియుడు. తిని తొంగోవడమే ఆయన పని. ఆయన దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి. ఈ కలియుగ కుంభకర్ణుడు కూడా దాదాపు అలాంటి వాడే. కాకపోతే ఆన మనతోనే కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాకపోతే ఆయనకు వండిపెట్టడానికి ఇద్దరు భార్యలు 24 గంటలూ కష్టపడుతున్నారు. ఇక ఆయన భోజనం పెట్టలేక బంధువులు శుభకార్యాలకు పిలవడం మానేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఆ కలుయుగ కుంబకర్ణుడే బీహార్‌కు చెందిన రఫీక్ అద్నాన్.
ఈ రోజుల్లో అందరూ ఫిట్‌నెస్, ఆరోగ్యం మీద దృష్టిపెడుతున్నారు. మితాహారం తీసుకుంటున్నారు. అనారోగ్యానికి కారణమయ్యే అధిక బరువుకు దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఇందుకోసం ఉదయం వాకింగ్, వ్యాయామం, స్విమ్మింగ్, జిమ్‌లకు వెళ్తున్నారు. ఇంకొదరు యోగా చేస్తున్నారు. ఇదే సమయంలో భోజన పరిమితి పాటిస్తున్నారు. కలియుగ కుంభకర్ణుడిగా గుర్తింపు పొందిన బీహార్‌లోని కటిహార్ జిల్లా జయనగర్‌కు చెందిన రఫీక్ అద్నాన్ మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదు.
200 కిలోల భారీ ఖాయం..
రఫీక్ అద్నాన్ భరువు 200 కిలోలకుపైనే.. అతడికి నడవడం కూడా చాలా కష్టంగా మారింది. రోజుకు 15 కిలోల ఆహారం పొట్టలోకి వెళ్లాల్సిందే. అతడి తిండికి భయపడి బంధువులు అతడిని శుభ, అశుభ కార్యాలకు పిలవడం మానేశారు. ఎటూ కదల్లేక ఎన్నో కష్టాలు పడుతున్నాడు. సాధారణ బైక్‌లు అతని బరువు మొయ్యలేవు కాబట్టి బుల్లెట్‌నే వాడుతుంటాడు. అది కూడా అప్పుడప్పుడు రఫీక్‌ను మోయలేక ఇబ్బంది పెడుతుంటుంది.
బులిమియా నెర్వోసా డిసీజ్..
రఫీక్ అద్నాన్ అరుదైన బులిమియా నెర్వోసా వ్యాధితో బాధపడుతున్నాడు. పరిమితి లేకుండా ఆహారం తీసుకోవడం ఈ వ్యాధి లక్షణం. పుట్టినప్పటి నుంచి రఫీక్ అధిక ఆహారం తీసుకునేవాడు. ప్రస్తుతం రఫీక్ ప్రతిరోజూ 3 కిలోల బియ్యం, 4 కిలోల గోధుమ పిండితో చేసిన రోటీలు, 2 కిలోల మాంసం, 1.5 కిలోల చేపలు తింటాడు. వాటితోపాటు రోజులో మూడుసార్లు ఒక లీటరు చొప్పున పాలు తాగుతాడు. మొత్తం మీద రఫీక్ రోజుకు 14–15 కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు. రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెట్టేందుకు 24 గంటలూ కష్టపడుతుంటారు. అయితే రఫీక్ తన గ్రామంలో సంపన్న రైతు. అందువల్ల అతనికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేదు.