KTR: ఓటమి కళ్లముందు కనిపిస్తే.. మనిషిలో అసహనం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటాయి. మాట పట్టు తప్పుతుంది. గొంతులో వణుకు పుడడుతుంది. వీటికి తానేమీ అతీతం కాదంతున్నాడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. సాధారణ మనిషికన్నా ఇంకా కిందికి దిగజారిపోతున్నానని తన మాటల ద్వారా చెప్పనే చెబుతున్నారు. ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్నారు. భాష పట్టు తప్పుతోంది. ఉన్న చదువులు చదివినా సంస్కరాం లేనప్పుడు ఏం ప్రయోజనం అన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ మృదువుగా మాట్లాడే మంత్రి కేటీఆర్ భాష చూసి చీదరరించుకుంటున్నారు. అనకూడని పదాలు ఆయన నోటి నుంచి దొర్లుతుండడం చూసి అసి అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమైన మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌లో ఫ్రస్టేషన్ పెరుగుతోందని, అందులో భాగంగానే ఆయన మాట పట్టు తప్పుతోందని కేటీఆర్‌ను ఇన్నాళ్లూ దగ్గరగా చూసిన వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఎన్నడూ లేని విధంగా చెప్పుతో కొడతానంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే స్థాయిలో కేటీఆర్ సయితం బండి సంజయ్‌పై ఫైర్ కావడం వెనక ఫ్రస్టేషనే కారణమని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.

బీజేపీ బలాన్ని జీర్ణించుకోలేక..
కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణలో వీలైనంత బద్నాం చేయడానికి బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్‌ను ఓడించాలని చూస్తోంది. కేసీఆర్ కుటుంబంపై అవినీతి ముద్ర వేయడమే కాకుండా అనేక ఆరోపణలు చేస్తుంది. కేటీఆర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయనకు అనేక మంది డ్రగ్స్ పంపిణీ చేసే వారితో సంబంధాలున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరి చాలా రోజులయినా కేటీఆర్ ఇప్పుడ స్పందించమేంటన్న ప్రశ్న సహజంగానే పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆయన ఒకవైపు విసిగిపోయి కనిపిస్తున్నారని అంటున్నారు.
నాడు స్టే తెచ్చుకుని.. నేడు రక్తం ఇస్తా.. బొచ్చు ఇస్తా అంటూ..
నిజానికి కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు బీజేపీ చేసినవి కావు. ఏడాది క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే చేశారు. ఈమేరకు కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరారు. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో విదేశాల్లో తిరుగుతున్నారని, డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వైట్ చాలెంజ్ స్వీకరించకపోగా, డ్రగ్స్ ఆరోపణలు చేయకుం స్టేతెచ్చుకుని తాజాగా నేను చాలెంజ్‌కు రెడీ రక్తం కావాలా, గోళ్లు కావాలా, కిడ్నీ కావాలా, బొజ్జు కావాలా అని అసహనంగా మాట్లాడడంపై గులాబీ నేతలో ఆశ్చర్యపోతున్నారు.
ఫ్రస్టేషన్‌కు పరాకాష్ట..
తండ్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చడం, సోదరి కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపించడం వంటి వాటితో కేటీఆర్‌లో అసహనం పెరిగిందంటున్నారు గులాబీ నేతలు. మరోవైపు బీజేపీ కూడా టార్గెట్ చేయడంతో ఆయన ఫ్రస్టేషన్‌కు గురవుతున్నాడని పేర్కొంటున్నారు. సోదరి కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పదే పదే వినిపించడం, ఈడీ విచారణ వంటి అంశాలు పార్టీకి మైనస్ తెచ్చి పెడతాయని కేటీఆర్ ఆందోళన చెందుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అనేక నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువగా ఉండటం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సెట్ చేయలేకపోతన్నానన్న ఆవేదన కేటీఆర్‌లో ఉందని సమాచారం. సొంత నియోజకవర్గంలో జరుగుతున్న సెస్ ఎన్నికల్లోనూ పార్టీ నేతల తిరుగుబాటు కేటీఆర్‌కు తలనొప్పిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ సక్సెస్ అయినట్లేనా?
బీజేపీ నేతల రెచ్చగొట్లే వ్యాఖ్యలు రామన్నలో ఆగ్రహం కలిగించాయని చెబుతున్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్న నేత. సెటైర్లు వేస్తారేమో కానీ.. తిట్లకు, పరుష పదజాలానికి కేటీఆర్ దూరంగా ఉంటారన్నది ప్రతీతి. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే కేటీఆర్ ఒక్కసారి అలా విరుచుకుపడటం, బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా దూషించడం వంటివి చూస్తే బీజేపీ నేతలు ఎంత ఫ్రస్టేషన్‌కు గురి చేస్తున్నారో చెప్పకనే తెలుస్తుంది. ఒకరకంగా బీజేపీ ఈ విషయంలో సక్సెస్ అయిందనే అనుకోవాలి. నిజమో.. అబద్ధమో.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఫ్రస్టేషన్‌కు గురి చేయడంలో కమలనా«థులు విజయం సాధించినట్లే అన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.