ఆ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్!

నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఇద్దరు వ్యక్తులు మార్కెట్ కి వెళ్లారు. వారు విదేశీయులవలె వలే ఉన్నారంటూ.. అక్కడ సిబ్బంది వారిని లోపలి అనుమతించలేదు. ఈ ఘటన పై తెలంగాణ మంత్రి సీరియస్ అయ్యారు. ఆ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తన స్నేహితులు ఇద్దరిని లోపలికి రానీయకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 4:17 pm
Follow us on


నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఇద్దరు వ్యక్తులు మార్కెట్ కి వెళ్లారు. వారు విదేశీయులవలె వలే ఉన్నారంటూ.. అక్కడ సిబ్బంది వారిని లోపలి అనుమతించలేదు. ఈ ఘటన పై తెలంగాణ మంత్రి సీరియస్ అయ్యారు. ఆ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తన స్నేహితులు ఇద్దరిని లోపలికి రానీయకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, జాత్యహంకారాన్ని ఏ రూపంలో ప్రదర్శించినా సరే కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా భావించాలని, ఈ మేరకు రిటైల్ అసోసియేషన్ కు ఆదేశాలు పంపేలా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలను ఆదేశించాలని తెలంగాణ డీజీపీకి సూచించారు.

ఆ నెటిజన్ చేసిన వరుస ట్వీట్లలో ఉన్న విషయం.. వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ కు వెళ్లిన తన మిత్రులిద్దరూ విదేశీయులను తలపించేలా ఉంటారని, ఆ కారణంతో వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తన మిత్రులిద్దరు తమకు సంబంధించిన ఆధార్ కార్డులను చూపించినప్పటికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదని, ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారని తెలిపారు.