
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొత్త పద్దతిలో చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నారు. వారు తయారు చేసిన మాస్కులను కొనే విధంగా ట్విట్టర్ వేదికగా చేనేత మాస్కుల్ని ప్రమోట్ చేసారు. దీంతో వారి మాస్కులను డిమాండ్ పెరుగుతుంది. చేనేత కార్మికుల మస్కులు రీయూజబుల్ మాస్కులు. అంటే ఈ మాస్కుల్ని ఎన్నిసార్లైనా ఉతికి వాడుకోవచ్చు. ధర కూడా చాలా తక్కువ. డబుల్ లేయర్డ్ మాస్క్ ధర రూ.20 మాత్రమే. పోచంపల్లి ఇక్కత్, కలంకారి ఫ్యాబ్రిక్ మాస్క్ ధర రూ.40. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా సింగిల్ యూజ్ మాస్కులే లభిస్తున్నాయి. అంటే మాస్కును ఒకసారి మాత్రమే వాడిపారెయ్యాల్సి ఉంటుంది. కానీ రోజూ మాస్క్ ధరించాలి కాబట్టి సింగిల్ యూజ్ మాస్కులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే రీయూజబుల్ అంటే మళ్లీ వాడుకోవడానికి వీలుండే మాస్కులు అయితే రోజూ ఉతికి ఎక్కువ రోజులు ఉపయోగించొచ్చు. చేనేత మాస్కులు ధర కూడా తక్కువ కాబట్టి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ చేనేత మాస్కుల్ని మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలోని చేనేత కార్మికులకు చేయూతగా నిలవాలని పిలుపునిస్తున్నారు.