https://oktelugu.com/

TS Politics: బీజేపీని లేకుండా చేయాలి.. తమిళ రాజకీయలపై కేటీఆర్ ఫోకస్ అందుకే?

TS Politics: తెలంగాణలో బీజేపీ తరుముకొస్తోంది. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా అధికార టీఆర్ఎస్ ను వేటాడుతోంది. టీఆర్ఎస్ లోని ముఖ్యులంతా వీడి బీజేపీలోనే చేరుతున్నారు. తాజాగా బలమైన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలోనే అసలు తెలంగాణలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తే మన పని సులువు అవుతుంది కదా అని కేటీఆర్ ఆలోచనలో పడ్డారట.. దీనికోసం ఏం చేయాలి? అని శూలశోధన చేసిన కేటీఆర్.. అసలు బీజేపీ,కాంగ్రెస్ లాంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2021 / 11:04 AM IST
    Follow us on

    TS Politics: తెలంగాణలో బీజేపీ తరుముకొస్తోంది. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా అధికార టీఆర్ఎస్ ను వేటాడుతోంది. టీఆర్ఎస్ లోని ముఖ్యులంతా వీడి బీజేపీలోనే చేరుతున్నారు. తాజాగా బలమైన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలోనే అసలు తెలంగాణలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తే మన పని సులువు అవుతుంది కదా అని కేటీఆర్ ఆలోచనలో పడ్డారట.. దీనికోసం ఏం చేయాలి? అని శూలశోధన చేసిన కేటీఆర్.. అసలు బీజేపీ,కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకు స్థానం ఇవ్వని తమిళనాడు రాజకీయాలపై ఆయన ఫోకస్ పడింది. బీజేపీని తమిళ పార్టీలు ఎలా ఎదుర్కొంటున్నాయి? అక్కడి ప్రజలు ఎందుకు చీదరిస్తున్నారు? అలాంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకురావచ్చా? ఇక్కడ బీజేపీని లేకుండా చేయాలంటే ఏంచేయాలనే దానిపై ఇప్పుడు కేటీఆర్ ఆ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారట..

    bjp telangana

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)’ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఏడేళ్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాలన సాగిస్తోంది. అయితే ఏడేళ్ల తరువాత టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లాయా..? అందుకే ప్రత్యామ్నాయ పార్టీలను గెలిపిస్తున్నారా…? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ చర్ఛల ఫలితంగా టీఆర్ఎస్ నాయకులు అలర్ట్ అయ్యారు. చాలా ఈజీగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్యంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ఆ తరువాత లైట్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ ఎన్నీకల్లోనూ బీజేపీ బలం పెంచుకుంది. ఇలాగే ఉంటే రాను రాను బీజేపీ పట్టు సాధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు కొందరు. అయితే ఆ పరిస్థితి రానిచ్చే పరిస్థితి లేదంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవసరమైతే కొంతమంది నాయకులతో కలిసి తమిళనాడు వెళ్లి అక్కడి పార్టీల పనితీరును పరిశీలిస్తామన్నారు. తమిళనాడు వెళ్లి కేటీఆర్ తెలుసుకోవాల్సిన విషయాలేంటి..? అక్కడికి వెళ్లాల్సిన అవసరం కేటీఆర్ కు ఎందుకు వచ్చింది..?

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమతిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. అయితే కొంత కాలంగా పార్టీపై వ్యతిరేకత వస్తుందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నాయకుల సందడి చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడి ఉప ఎన్నికలో గెలిస్తే ఓకే.. కానీ సీటు కోల్పోతే మాత్రం పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లేనని అంటారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ బలపడే అవకాశం ఉంది. అయితే అంతకుముందే కేటీఆర్ తమిళనాడు తరహా రాజకీయాలను శాసించాల్సిన అవసరం ఉందన్నట్లు భావిస్తున్నారు.

    తమిళనాడు రాష్ట్రంలో ప్రాంతీయ వాదం ఎక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్ తో పోలిస్తే ఇక్కడున్న పార్టీలు అధికంగా ఉచిత పథకాలు ఇవ్వడం తప్ప కొత్తగా చేసేందేమీ లేదు. అయితే ద్రవిడ జాతీయత ఆధారంగా ప్రజలను ఇక్కడి ప్రజలను ఏకం చేసిన పార్టీ డీఎంకే. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణేతరులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి తొలిసారి సాంఘిక న్యాయం కోసం పోరాడిన చరిత్ర ఆ పార్టీది. బ్రహ్మణాధిపత్య వ్యతిరేకత, ఉత్తరాధిపత్య వ్యతిరేకత, హిందీ ఆధిపత్య వ్యతిరేకత, సాంఘిక న్యాయం కోసం డీఎంకే పార్టీ ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది.

    దీంతో ఇక్కడ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు మినహా మిగతా పార్టీలకు చోటు దక్కదు. వాజ్ పేయి హయాంలోనూ దేశం మొత్తం బీజేపీ గాలి వీచినా తమిళనాడులో మాత్రం వీలు కాలేదు. మొన్న మోడీ హయాంలోనూ అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకున్నా కొన్ని స్థానాలకే పరిమితమైంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా 1956లో పద్మనాభపురం అసెంబ్లీ సీటులో బీజేపీ గెలుచుకుంది. ఆ తరువాత 2001లో 21 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ తరువాత మళ్లీ బీజేపీ నాయకలు గెలవలేదు.

    తమిళ ప్రజల్లో బలమైన ప్రాంతీయవాదం అలుముకోవడంతో ఇక్కడి వారు ఎక్కువగా డీఎంకే పార్టీనే ఆదరిస్తారు. మరోవైపు బీజేపీపై వ్యతిరేకత భావం ఇప్పటికీ కొనసాగుతుండడంతో పార్టీపై ప్రజల్లో నమ్మకం సడలింది. మరోవైపు బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉండడం వల్ల వీరిపై పెత్తనం మిగతా వర్గాలు చేయడానికి అవకాశం ఉండదు. తమిళ, ద్రవిడ జాతికి చెందిన వారే ఇక్కడ పరిపాలన చేయాలనే నిబంధనను వారి అంటిపెట్టుకున్నారు.

    అయితే టీఆర్ఎస్ తాజాగా డీఎంకే విధానాలను అనురిస్తానని అంటోంది. డీఎంకే బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ టీఆర్ఎస్ అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణలో ప్రాంతీయ వాదం ఉన్నా తమిళనాడులో ఉన్నంత బలంగా లేదు. ఎందుకంటే తమిళనాడులో బలహీన వర్గాలదే పైచేయి అన్నట్లుగా పాలన సాగుతోంది. కానీ తెలంగాణలో బలమైన వర్గాలే ఎక్కువగా పాలక వర్గంలో ఉండడంతో గులాబీ పార్టీకి ఆ పోలికే లేదంటున్నారు. మరి తమిళనాడు తరహాలోనూ తెలంగాణలో బీజేపీని లేకుండా చేయాలన్న కేటీఆర్ పంతం నెరవేరుతుందా? లేదా అనేది చూడాలి.

    Also Read: హుజూరాబాద్ లో.. బెట్టింగ్ బంగార్రాజులు! రేంజ్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

    రేవంత్ చెప్పినట్టు ‘ముంద‌స్తు’ ఉంట‌దా.. ? ఆ వ్యాఖ్య‌ల వెన‌క మ‌ర్మం ఏంటి ?