Homeఆంధ్రప్రదేశ్‌Kothapalli Subbarayudu: టిడిపిలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు?

Kothapalli Subbarayudu: టిడిపిలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు?

Kothapalli Subbarayudu: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరే స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పటినుంచి టిడిపిలో చేరాలా? లేకుంటే జనసేనలోన? అన్న డిఫెన్స్ లో ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బారాయుడు సుదీర్ఘకాలం టిడిపిలోనే పనిచేశారు. అనివార్య కారణాలవల్ల పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తరచూ లోకేష్ తో కనిపిస్తుండడంతో ఆయన తప్పకుండా టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీ నుంచి రాజమండ్రి వెళ్తున్న క్రమంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో లోకేష్ తో సుబ్బారాయుడు కనిపించారు. చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ లేకుంటే.. ఈపాటికే సుబ్బారాయుడు టిడిపిలో చేరి ఉండేవారని టాక్ నడుస్తోంది. 1989లో తొలిసారిగా నరసాపురం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన సుబ్బరాయుడు విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు.

2009లో సుబ్బారాయుడు టిడిపికి దూరమయ్యారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం కావడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల నాటికి వైసీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి జంప్ అయ్యారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుతో వచ్చిన విభేదాలతో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. తొలుత జనసేన లో చేరాలని భావించారు. ఇప్పుడు మాత్రం టిడిపిలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన తరచూ లోకేష్ తో కనిపిస్తున్నారు. ఢిల్లీలో సైతం ఆయన వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చూస్తే నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణంరాజుతోను తరచూ చర్చలు జరుపుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నరసాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పొత్తూరు రామరాజు టికెట్ రేసులో ఉన్నారు. మరి సుబ్బరాయుడు టిడిపిలో చేరితే ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version