Nara Lokesh Zoom Meeting : చంద్రబాబు సుపుత్రుడికి గట్టి షాక్ తగిలింది. అసలే ఆయన మాటల సామర్థ్యం అందరికీ తెలిసింది. అసలే బోటాబోటీగా ఆయన మాట్లాడుతారు. తెలుగుపై పట్టు తక్కువ. అలాంటి లోకేష్ బాబు తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఫెయిల్ అయిపోయిన పదోతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. నారా లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లో బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న బాధిత పదోతరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈ మీటింగ్ నిర్వహించారు.
అయితే ఈ జూమ్ మీటింగ్ వేళ నారా లోకేష్ కు గట్టి షాక్ తగిలింది. అనూహ్య సంఘటనకు లోకేష్ తోపాటు అందరూ షాక్ అయ్యారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ లో ప్రత్యక్షమవ్వడం సంచలనమైంది. దీన్ని గమనించిన నారా లోకేష్.. సమావేశంలో వైసీపీ నేతలు ఉన్నా ఫర్వాలేదని.. వైసీపీ ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏకంగా ఫైర్ బ్రాండ్స్ లాంటి కొడాలి నాని, వంశీలతోనే తలపడ్డారు.
విద్యార్థులను ఫెయిల్ చేయడం చేతగానితనం అని.. జూమ్ లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టబ్ చేస్తారా? అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కొడాలి నాని, వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు.
ఇక కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొని నారా లోకేష్ పై ఎద్దేవా చూపులు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడుతానంటూ లోకేష్ ఆ సమావేశాన్ని కొనసాగించారు.
ఇలా లైవ్ లో సడెన్ గా ఇద్దరు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ వచ్చేసరికి మీటింగ్ కు హాజరైన విద్యార్థులు ఇతరులు కాస్తా షాక్ అయ్యారు. నారా లోకేష్ కాస్త తటపటాయించినా ధైర్యంగా దీన్ని ఎదుర్కొని సత్తా చాటారు.