బెంగాల్ లో ఫిరాయింపుదారులే కింగ్ మేకర్లు?

గత నెల రోజులుగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన మినీ సంగ్రామంపై దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఫలితంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ బీజేపీ, టీఎంసీ నువ్వా,నేనా అన్న విధంగా పోరు సాగింది. రెండు సార్లు అధికారంలో ఉన్న టీఎంసీని హ్యట్రిక్ కు అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేసింది. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే కేంద్రం పెద్దలు ఇక్కడ మకాం వేసి […]

Written By: NARESH, Updated On : April 30, 2021 9:19 am
Follow us on

గత నెల రోజులుగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన మినీ సంగ్రామంపై దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఫలితంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ బీజేపీ, టీఎంసీ నువ్వా,నేనా అన్న విధంగా పోరు సాగింది. రెండు సార్లు అధికారంలో ఉన్న టీఎంసీని హ్యట్రిక్ కు అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేసింది. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే కేంద్రం పెద్దలు ఇక్కడ మకాం వేసి అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. తాము బలపడేందుకు వ్యూహాత్మంగా ముందుకు వెళ్లిన బీజేపీ ఈసారి టీఎంసీ కంచుకోటకు బద్దలు కొడుతుందా..?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ అధికారం దక్కించుకోవడానికి బీజేపీ తన శక్తినంతా కూడగట్టుకుంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ 18 స్థానాలను గెలుచుకుంది. అంటే దాదాపు 121 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పట్టు ఉందన్నమాట. ఓట్ల శాతం కూడా 40 శాత కంటే ఎక్కువే ఉంది. పట్టు ఉన్న స్థానాలను మినహాయించి మిగతా స్థానాలపై కమలం పెద్దలు దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో ఫిరాయింపుల జోరును పెంచారు. ముఖ్యంగా తృణముల్ కు చెందిన ముఖ్య నేతలను లాగేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలెవరినీ వదిలిపెట్టకుండా పార్టీలో చేర్చుకున్నారు. ఒకవైపు టీఎంసీ నాయకులకు వల వేయడంతో పాటు మరోవైపు ఆ పార్టీ అధినేత మమతను మానసికంగా దెబ్బకొట్టడానికి లక్ష్యంగా కాషాయం పార్టీ నాయకులు ముందుకెళ్లారు. దీంతో ఇక్కడ నువ్వా నేనా..? అన్న విధంగా బీజేపీ, టీఎంసీల మధ్యే ప్రధాన పోరు జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఫిరాయింపులతో ప్రజలు బీజేపీని ఆదరిస్తారా..? లేక మమతకే మద్దతు ఇస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే అక్కడ పట్టున్న పార్టీలను దెబ్బకొట్టి నాయకులను చేర్చుకున్నా అక్కడ ఫలితం ఇవ్వలేదు. అందుకు మహారాష్ట్రను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బీజేపీని ప్రజలు ఎంతమేరకు ఆదరిస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఏ విషయమైనా తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే..