వలస కూలీలకు వరమిచ్చిన జగన్..!

రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్న ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. వలస కూలీలు కోసం బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోమన్నారు. ఇందుకు విధి, విధానాలు చేయాలన్నారు. వారికి ప్రయాణ సదుపాయం పూర్తిగా ఉచితంగా అందించాలని చెప్పారు. నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. కరోనపై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వలస కూలీలకు భోజనాలు, తాగు నీరు ఏర్పాటు […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 5:19 pm
Follow us on

రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్న ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. వలస కూలీలు కోసం బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోమన్నారు. ఇందుకు విధి, విధానాలు చేయాలన్నారు. వారికి ప్రయాణ సదుపాయం పూర్తిగా ఉచితంగా అందించాలని చెప్పారు. నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. కరోనపై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వలస కూలీలకు భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సూచించారు. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితిని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. భౌతిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకు రావాలని సూచించారు. తన దుకాణం ముందు వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కోవిడ్‌ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని ఆదేశించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదు కొత్తగా నమోదైన 48 కేసులలో 31 కేసులు కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవని అధికారులు సీఎంకు తెలిపారు.