https://oktelugu.com/

Teachers’ Assets : టీచర్లకు గట్టి షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇది జరగాల్సిందేనా?

Teachers’ Assets  తెలంగాణలో టీచర్ల ఆస్తుల లెక్కలు తీసే పనిలో కేసీఆర్ పడ్డారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లో పాఠాలు చెప్పకుండా.. చెబుతున్నట్టు హాజరు వేసుకొని బయటపడి.. విద్యార్థులకు అన్యాయం చేస్తూ బయట దందాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది విధులకు హాజరు కాకుండా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. అంతే కాదు.. కొందరు రాజకీయ కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్లు చేస్తూ బయట క్రియాశీలకంగా తిరుగుతున్నారు. ప్రభుత్వ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 25, 2022 / 05:43 PM IST
    Follow us on

    Teachers’ Assets  తెలంగాణలో టీచర్ల ఆస్తుల లెక్కలు తీసే పనిలో కేసీఆర్ పడ్డారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లో పాఠాలు చెప్పకుండా.. చెబుతున్నట్టు హాజరు వేసుకొని బయటపడి.. విద్యార్థులకు అన్యాయం చేస్తూ బయట దందాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది విధులకు హాజరు కాకుండా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. అంతే కాదు.. కొందరు రాజకీయ కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్లు చేస్తూ బయట క్రియాశీలకంగా తిరుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధులను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భావి జీవితాలతో ఆటలాడుకుంటున్నట్టు ప్రభుత్వ విచారణలో తేలిందట.. దీంతో సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై కేసీఆర్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థిర, చరాస్థుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు కారణం కూడా ఉంది.

    తాజాగా నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యుడు మహ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా బయట రాజకీయాలు, సెటిల్ మెంట్లు,రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని 2021లో ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. ట్విస్ట్ ఏంటంటే చాలా మంది ఉపాధ్యాయులు బయట ఇదే పనులు చేస్తున్నారని విచారణలో తేలింది. శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. జావేద్ అలీతోపాటు టీచర్ల అందరికీ ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది.

    దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు చెప్పకుండా బయట దందాలు చేస్తున్న టీచర్లకు చెక్ పడింది. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతోపాటు స్థిర, చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఇక టీచర్లు ఏ ఆస్తులు కొనాలన్న ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. తీసుకుంటే ఆస్తుల లెక్కలన్నీ బయటపడుతాయి. ఐటీ దాడులకు కారణమవుతుంది. ఇలా విధుల్లో పాల్గొనకుండా అక్రమార్జన చేసే టీచర్లకు ప్రభుత్వం ముకుతాడు వేసినట్టైంది.