కేశినేని నాని సంచలన ట్వీట్‌

ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు కామన్‌. ప్రభుత్వంలో ఉన్న వారు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం కూడా కామన్‌. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకోవడం రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇంకా ఎక్కువ. Also Read: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ భారీ ఊరట తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ సర్కార్‌‌ కొంత మందికి కాంట్రాక్ట్‌లను పంచి పెట్టిందంటూ ట్వీట్‌ చేశారు. ఎవరెవరికి ఎంత […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 3:43 pm
Follow us on


ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు కామన్‌. ప్రభుత్వంలో ఉన్న వారు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం కూడా కామన్‌. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకోవడం రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇంకా ఎక్కువ.

Also Read: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ భారీ ఊరట

తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ సర్కార్‌‌ కొంత మందికి కాంట్రాక్ట్‌లను పంచి పెట్టిందంటూ ట్వీట్‌ చేశారు. ఎవరెవరికి ఎంత కట్టబెట్టారో వివరాలు కూడా ప్రస్తావించారు. ‘నిన్న మొత్తం జగన్ మోహన్ రెడ్డి తనవారికి పంచిన రోడ్డు కాంట్రాక్టులు రూ.791.53 కోట్లు.. ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలు.. PLR (పెద్దిరెడ్డి) : రూ.126 కోట్లు.. NSPR (నర్రెడ్డి.. పులివెందుల, వైఎస్‌ చుట్టం): రూ.228 కోట్లు.. KCVR (సురేష్ రెడ్డి): రూ.128.36 కోట్లు.. నితిన్‌ సాయి (పార్థసారధి వైసీపీ) : రూ.121.63 కోట్లు.. JMC ( శ్రీనివాసులు చిత్తూర్ వైసీపీ ఎమ్మెల్యే) : రూ.186.కోట్లు’ అని ఆరోపించారు.

Also Read: పిల్లలు లేకపోవడానికి కారణమదే.. నా ఆస్తులన్నీ వారికే: విజయశాంతి

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఐదు జిల్లాల్లో చేపట్టే రోడ్డు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఈ పనులు నిర్వహించనున్నారు. మొత్తం రూ.791.53 కోట్లకు టెండర్లు పిలిచి.. రివర్స్ బిడ్డింగ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో పనుల్ని పెద్దిరెడ్డి, కర్నూలు జిల్లాలో పనుల్ని వైఎస్ బంధువులు, కడపలో పనుల్ని వైఎస్సార్‌సీపీ పార్థసారధి, అనంతపురం జిల్లాలో పనుల్ని కేసీఆర్, ప్రకాశం జిల్లాలో పనుల్ని చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్