Homeజాతీయ వార్తలుSonia Gandhi: బిజెపి తరఫున ఎన్నికల బరిలో సోనియాగాంధీ.. అంతా షాక్

Sonia Gandhi: బిజెపి తరఫున ఎన్నికల బరిలో సోనియాగాంధీ.. అంతా షాక్

Sonia Gandhi: సోనియాగాంధీ.. పరిచయం అక్కరలేని పేరు. అత్యంత అరుదు.. కాదు కాదు.. ప్రస్తుతానికి ఈ ఒక్క పేరే అందరికీ తెలుసు. కానీ శీర్షిక చదవగానే సోనియాగాంధీ ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు.. ఇప్పటికిప్పుడే ప్రత్యక్ష ఎన్నికలు దేశంలోగానీ, ఏ రాష్ట్రంలో గానీ లేవు. అలంటప్పుడు సోనియగాంధీ ఏ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు అన్న టెన్షన్‌ కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. కానీ, మీరు చదివిన వీర్షిక నిజమే.. సోనియాగాంధీ ఎన్నికల బరిలో ఉన్న మాట నిజమే. కాకపోతే కాంగ్రెస్‌ అగ్రనేత, దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ భార్య, మరో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కోడలు సోనియాగాంధీ వేరు.

ఎవరీ సోనియా..
కేరళకు చెందిన కాంగ్రెస్‌ నేత దురైరాజ్‌… కాంగ్రెస్‌ అగ్రనేత సోనియగాంధీపై అభిమానంతో తన కూతురుకు కూడా సోనియగాంధీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం దురైరాజ్‌ చనిపోయారు. ఆయన కూతురు పెరిగి పెద్దయింది. కాంగ్రెస్‌లో కొంతకాలం పనిచేసింది. కేరళలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని భావించింది. బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఈ జూనియర్‌ సోనియాగాంధీ కేరళలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో దిగింది. కేరళ మున్నార్‌ నల్లతన్ని వార్డు (వార్డు 16)లో బీజేపీ అభ్యర్థిగా 34 ఏళ్ల సోనియా గాంధీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ నేత కూరుతు అయిన ఈ సోనియాజజ వివాహం తర్వాత భర్త సుభాష్‌ ప్రభావంతో బీజేపీలో చేరింది,

ఎన్నికల నేపథ్యం
కేరళలో డిసెంబర్‌ 9, 11 తేదీలు జరిగే పంచాయతీ ఎన్నికల్లో మున్నార్‌ పోటీ ఆసక్తికరంగా మారింది. సోనియా ప్రత్యర్థులు కాంగ్రెస్‌ అభ్యర్థి మంజులా రమేశ్, సీపీఆర్‌æ(ఎం) వలర్మతి. ఈ పేరు సమానత్వం ప్రజల్లో ఆశ్చర్యం, చర్చలు రేకెత్తిస్తోంది.

కాంగ్రెస్‌ నేపథ్యం ఉన్నవారు బీజేపీ వైపు మళ్లడం ఈ ఎన్నికల్లో కొత్త ధోరణిని సూచిస్తోంది. సోనియా ప్రచారంలో పేరు కంటే పని ప్రాధాన్యత అని ఒక్కోసారి చెబుతోంది. డిసెంబర్‌ 13న ఫలితాలు వెలువడతాయి. మరి ఈ బీజేపీ సోనియాగాంధీ విజయం సాధిస్తారా లేదా అనేది డిసెంబర్‌ 13న తెలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular