Kerala: సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో మనుషుల్లో వింత ప్రదర్తన కనిపిస్తోంది. చిన్న వయసులోనే తలకు మించిన పనులు చేయడం సాధారణమైపోయింది. ప్రసార మాధ్యమాల ఫలితంగా ఎంతటి నేరం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. తనకన్నా వయసులో పెద్దవారిపైనా అఘాయిత్యం చేసేందుకు వెనుకాడటం లేదు. ఫలితంగా చిక్కుల్లో పడుుతన్నారు. కేరళలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.

పట్టుమని 15 ఏళ్లు ఉన్న బాలుడు ఓ అమానుష చర్యకు దిగాడు. తనకన్నా పెద్దదైన యువతి(21)పై లైంగిక దాడి చేసేందుకు పూనుకున్నాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అతడి క్రూరత్వం చూసి యువతి నిర్ఘాంత పోయింది. షాక్ కు గురైంది. అచ్చం సినీఫక్కీలో జరిగిన సంఘటనపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ తరగతులకు వెళుతున్న యువతిని ఓ బాలుడు వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో పెద్దగా జనసంచారం కనిపించలేదు. దీంతో అతడు ఆ యువతిపై లైంగిక దాడి చేసేందుకు లాక్కెళ్లాడు. యువతి ప్రతిఘటించడంతో తలపై రాయితో కొట్టి చేతులను దుప్పటతో కట్టి తరువాత గొంతు నొక్కి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె తప్పించుకుని పరుగులు పెట్టి ఓ ఇంట్లోకి దూరింది. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Kerala: యూ ట్యూబ్ లో చూస్తూ ప్రసవం.. కేరళలో బాలిక చర్య వివాదాస్పదం
ఘటనకు కారణమైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. అనంతరం జువైనల్ హోంకు తరలించి యువతితో మాట్లాడారు. ఆ బాలుడిని మాత్రం తాను ఎప్పుడు చూడలేదని యువతి చెప్పింది. కానీ ఆ బాలుడికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్నట్లు సమాచారం.
Also Read: నాలుగేళ్లుగా అక్కను.. మత్తు మందు ఇచ్చి 17 ఏళ్ల ఆమె చెల్లిపై రేప్