https://oktelugu.com/

KCR – ABN RK : కేసీఆర్ ది “తుక్కు” సంకల్పం.. గాలి తీసేసిన ఆర్కే

KCR -ABN RK : మొన్ననే కదా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్ ఆవిష్కరించింది. ఆ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను పిలిచింది. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించింది. కానీ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం కెసిఆర్ గాలి తీసేశాడు. నీకున్న ఎంపీ సీట్లతో ఢిల్లీకి పోయి ఏం…గలవు అని ఎద్దేవా చేశాడు. అంతేకాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నీ ఆసక్తి ఏమిటో నాకు తెలుసు అంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2023 / 11:21 AM IST
    Follow us on

    KCR -ABN RK : మొన్ననే కదా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్ ఆవిష్కరించింది. ఆ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను పిలిచింది. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించింది. కానీ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం కెసిఆర్ గాలి తీసేశాడు. నీకున్న ఎంపీ సీట్లతో ఢిల్లీకి పోయి ఏం…గలవు అని ఎద్దేవా చేశాడు. అంతేకాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నీ ఆసక్తి ఏమిటో నాకు తెలుసు అంటూ పరువు తీశాడు.

    “వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని సారాంశం ఏంటయ్యా అంటే… మా దగ్గర స్టీల్ ఉత్పత్తులు ఉన్నాయి, మాకు కొంచెం ముడి సరుకు లేదా డబ్బులు ఇచ్చి వీటిని తీసుకెళ్లండి అని అడిగింది. దానికి ఈ కేసీఆర్ అండ్ కో రకరకాల ప్రయోగాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది కాబట్టి, తనకు అక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి కెసిఆర్ తెరపైకి వ్యూహాత్మకంగా సింగరేణి సంస్థను తీసుకొచ్చాడు.. అసలు కార్మికులకే అప్పులు తీసుకొస్తే తప్ప జీతాలు ఇవ్వలేని సింగరేణి వైజాగ్ స్టీల్ లో బిడ్ ఎలా వేస్తుంది? అసలు సింగరేణి సంస్థను ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎంత బ్రష్టు పట్టించారో తెలుసా? ఆ సంస్థకు సంబంధించిన నిధులను ఎలా వాడుకున్నారో తెలుసా? ఇలాంటి కేసీఆరా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడేది” అంటూ రాధాకృష్ణ తన కొత్త పలుకులు రాసుకుంటూ పోయాడు. అంతేకాదు చాలా రోజుల తర్వాత తన జర్నలిస్టు టెంపర్ మెంట్ చూపించాడు. తన కొత్త పలుకులో చంద్రబాబు ప్రస్తావన అంతంతమాత్రంగా ఉన్నప్పుడు ఎలా చెలరేగి పోతాడు రాధాకృష్ణ పాఠకులకు ఈసారి మరింత ఎక్కువ చూపించాడు.

    “గుజరాత్ లో పటేల్ విగ్రహమైనా, తెలంగాణలో అంబేద్కర్ విగ్రహమైనా వాటి ఎత్తు ప్రజల జీవితాల్లో తీసుకురాగల గుణాత్మక మార్పు ఏదీ ఉండదు. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి నోటిమాట దాటలేదు. కులహత్యల కేసుల్లో న్యాయం జరగడం లేదు. సబ్ ప్లాన్ అమలుకు దిక్కులేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా దగా పడ్డ దళితులే కనిపిస్తారు. వీళ్ళు ఎవరు కూడా 125 అడుగుల విగ్రహాలు కావాలని అడగలేదు. గతంలో ఇదే అంబేద్కర్ జయంతికి ముందు రోజు పంజాగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ విగ్రహాన్ని కూల్చి చెత్తకుప్పులో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుడిని ఆకాశానికి ఎత్తుకోవడం వెనుక ఉన్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు గుర్తిస్తున్నారు అంటూ” రాధాకృష్ణ రాసుకొచ్చాడు. కెసిఆర్ చేస్తున్న తప్పులను మరో మాట లేకుండా తూర్పారబట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆర్కే ఈ వ్యాసంలో తన ఆవేశాన్ని కెసిఆర్ కు చవిచూపించాడు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో సంపాదకీయం రాయలేదు.

    కెసిఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు పెడుతున్నారు అంటూ రాధాకృష్ణ ఆరోపించారు. ” తెలంగాణలో 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న విషయం విస్మరించి జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించాలని కేసీఆర్ భావించడం వింతగా ఉందని తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ, భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ వద్ద వ్యాఖ్యానించాడు. మహా అయితే మీరు 10 సీట్లు గెలవచ్చు. లోక్ సభలో మా బలం ఇప్పుడు 39 సీట్లు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య తగ్గదు అనుకుంటున్నాం. ఎనప్పటికి మా ముఖ్యమంత్రి స్టాలిన్ నేల మీదనే ఉన్నాడు. అని సదరు తమిళ తంబి వ్యాఖ్యానించాడు. మబ్బులను చూసుకొని మా ముఖ్యమంత్రి చెంబులో నీళ్లను వాల్కపోసుకుంటున్నాడు అని బిఆర్ఎస్ ముఖ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణలో అంత నష్టం జరిగే ప్రమాదం ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా స్వరాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్లు ఎన్నికలు సమీపించే కొద్ది పెరుగుతాయని తెలంగాణ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దళిత బంధు గురించి ప్రచారం పెంచిన కొద్ది ఇతర వర్గాల నుంచి తమకు కూడా అలాంటి పథకం అమలు చేయాలని డిమాండ్లు కూడా పుట్టుకొస్తాయని ఆయన చెప్పుకొచ్చారు” అని రాధాకృష్ణ ఎక్కడ తొణకకుండా రాసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కౌంటర్ చేయలని పాయింట్లు రాధాకృష్ణ కార్నర్ చేశారు. అయితే వైజాగ్ స్టీల్ ద్వారా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ అడుగుపెడితే చంద్రబాబుకు నష్టం వాటిల్లుతుందని తెలిసే రాధాకృష్ణ అప్రమత్తమయ్యాడని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అందుకే తన కొత్త పలుకులో కెసిఆర్ ను చెండాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై నమస్తే తెలంగాణ కౌంటర్ గా ఏం రాస్తుందో చూడాల్సి ఉంది.