KCR National party : తగ్గేదే లే.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ముహూర్తం ఖరారు

KCR National party : తెలంగాణలో రెండు సార్లు అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయస్థాయికి పడబోతున్నాయి. గుజరాత్ మోడల్ ను చూపించి దేశానికి మోడీ ఎలా ప్రధాని అయ్యారో ఇప్పుడు తెలంగాణ మోడల్ తో తనూ ప్రధాని అయిపోవాలని కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశంలో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ జెండా, ఎజెండా, ప్రకటన ఎప్పుడన్నది దాదాపు […]

Written By: NARESH, Updated On : October 2, 2022 5:53 pm
Follow us on

KCR National party : తెలంగాణలో రెండు సార్లు అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయస్థాయికి పడబోతున్నాయి. గుజరాత్ మోడల్ ను చూపించి దేశానికి మోడీ ఎలా ప్రధాని అయ్యారో ఇప్పుడు తెలంగాణ మోడల్ తో తనూ ప్రధాని అయిపోవాలని కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశంలో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ జెండా, ఎజెండా, ప్రకటన ఎప్పుడన్నది దాదాపు డిసైడ్అయ్యారు.

దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. అక్టోబర్ 5న దసరా రోజున ఉదయం 11 గంటలకు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మొత్తం 283మంది పార్టీ నేతలు సమావేశం కానున్నారు. జాతీయ పార్టీ తీర్మానంపై సంతకాల తర్వాత మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.

డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా వంటి అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీకి హైప్ తీసుకురావడానికి ఫ్లెక్సీలు, బాణసంచా సహా ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

మొత్తంగా ఎంతో కసరత్తు.. ఊగిసలాట తర్వాత కేసీఆర్ బయటకొస్తున్నారు. చాలా మంది మేధోమథనం తర్వాత దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ల తర్వాత మరో జాతీయ పార్టీ పురుడుపోసుకుంటోంది. మరి తెలంగాణను కష్టపడి సాధించిన కేసీఆర్ జాతీయ స్తాయిలో సత్తా చాటగలడా? ఆదరణ దక్కుతుందా? ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.