KCR BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో నిన్న రాత్రి ప్రశాంత్ కిషోర్ తోపాటు ఏపీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రి హరీష్ రావులతో కీలక భేటి నిర్వహించారు. ఈ భేటి తాలూకా లీకులు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ రేపు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈక్రమంలోనే కేసీఆర్ తో మీటింగ్ కు సంబంధించిన విషయాలను ఆయన పంచుకోబోతున్నాడు.
భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పేరుతో ఒక కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా కేసీఆర్ తొలి ఫోకస్ పక్కనే ఉన్న ఏపీపైనే పడింది. ఇంటగెలిచి రచ్చగెలవాలన్నట్టుగా కేసీఆర్ సహచర తెలుగు ప్రజల మద్దతు కూడగట్టేందుకు పార్టీని అక్కడా విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలని చూస్తున్నారు.
Also Read: AP MPs: కండోమ్ రెడ్డి, విగ్ రాజా.. ఛీఛీ.. దిగజారిపోయిన ఏపీ ఎంపీలు!
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు గల అవకాశాలపై కేసీఆర్ పలువురు ప్రముఖులు, మేధావులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ విస్తరణ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
తెలంగాణ విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలను ఎలా మెప్పించాలని.. దాని అవకాశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ.. నిజాయితీపరుడిగా పేరుగాంచిన ఉండవల్లిని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా నియమించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ప్రగతిభవన్ కు పిలిపించుకొని మరీ ఉండవల్లితో కేసీఆర్ మంతనాలు జరపడం విశేషంగా మారింది.
జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ఉండవల్లికి మంచి పట్టుంది. కానీ ఆయన చాలా రోజులుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్నలతో ఏపీ పాలక పార్టీలను నిలదీస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఉండవల్లి సక్సెస్ అవుతుంటారు. అందుకే కేసీఆర్ ఈయనను ఎంపిక చేసి బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో సరైన నేతగా గుర్తించినట్టు సమాచారం. జాతీయ రాజకీయాల్లో కూడా ఉండవల్లి అనుభవం కేసీఆర్ కు ఉపయోగపడుతుందని అందుకే ఎంపిక చేసినట్టు సమాచారం.
ఇక ఏపీ రాజకీయాలు 2024 వరకూ ఎటువైపు మరలుతాయో తెలియదు. సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ ను బీజేపీ గుర్తించకపోవడంతో ఆయన సొంతంగా ఏపీలో యాత్ర చేపట్టారు. పోటీగా బీజేపీ కూడా ఒంటరిగానే ప్రజల్లోకి వెళుతోంది. బీజేపీకి-జనసేనకు క్రమంగా దూరం పెరుగుతోంది. ఈ దూరాన్ని క్యాష్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈక్రమంలోనే బీఆర్ఎస్ కు అనుబంధంగా పవన్ కళ్యాణ్ ను కలుపుకుపోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఉండవల్లి, పవన్ కళ్యాణ్ లాంటి నేతల తోడుంటే కేసీఆర్ ఏపీలో మంచి ఫలితాలు రాబట్టగలరని..జాతీయ స్థాయిలోనూ బలం పెరుగుతుందని ఆశిస్తున్నారు. మరి ఇదంతా జరుగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Also Read:Prashanth Kishor Report- Kcr: కేసీఆర్ కు పీకే ఇచ్చిన రిపోర్టులో ఏముంది..?