
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడగింపుకే మొగ్గుచూపింది. ఇప్పటికే మే 4వరకు లాక్డౌన్ అమలు చేస్తున్న కేంద్రం మరో రెండువారాలపాటు లాక్డౌన్ పొడగించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 17వరకు అమలు కానుంది. లాక్డౌన్ 3.0లో దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు షరతులతో కూడిన అనుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం సడలింపులు రాష్ట్రంలో ఈమేరకు అమలవుతాయేనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ ఏవిధంగా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.
లాక్ డౌన్3.0 లో నిబంధనలు ఇవే!
లాక్డౌన్ 2.0లో కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ మినహాయింపులను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయలేదు. కేంద్రం మే 3వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించగా కేసీఆర్ మాత్రం మే 7వరకు లాక్డౌన్ పొడగించారు. కేంద్రం ఇచ్చిన సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. అయితే కేంద్రం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక తప్పనిసరిగా మారింది. ఈ సడలింపుల్లో బస్సుల రాకపోకలు, మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారాయి. వీటి అమలులో సామాజిక దూరం పాటించడం అమలు సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నారు. వీటి అమలు విషయంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఈ నేపథ్యంలో కేంద్రం సడలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5న జరిగే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?
తాజాగా సమాచారం కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తో ముందుకెళ్లేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మే 5న పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి తెలంగాణ కరోనా కట్టడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన వారంరోజులుగా కరోనా కేసులు సింగిల్ డిజిట్ దాటకపోవడం గమనార్హం. కాగా శుక్రవారం తెలంగాణ కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యారు. వీటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 చేరింది. వీరిలో 464మంది కరోనా నుంచి కోలుకున్నారు. 552 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో 28మంది మృతిచెందారు.