KCR VS BJP: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?

KCR VS BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లు బీజేపీ పట్ల మెతకవైఖరి అవలంభించిన కేసీఆర్ ఇకపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమనే సంకేతాలను శ్రేణులకు పంపిస్తున్నారు. దీనికి అసలు కారణం మాత్రం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే కోరికేనని స్పష్టంగా అర్థమవుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారంగానే సీఎం కేసీఆర్ బీజేపీపై గురిపెడుతున్నరనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు […]

Written By: NARESH, Updated On : December 1, 2021 2:29 pm
Follow us on

KCR VS BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లు బీజేపీ పట్ల మెతకవైఖరి అవలంభించిన కేసీఆర్ ఇకపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమనే సంకేతాలను శ్రేణులకు పంపిస్తున్నారు. దీనికి అసలు కారణం మాత్రం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే కోరికేనని స్పష్టంగా అర్థమవుతోంది.

KCR VS BJP

పక్కా ప్రణాళిక ప్రకారంగానే సీఎం కేసీఆర్ బీజేపీపై గురిపెడుతున్నరనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండగా అదే సమయంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే తెలంగాణలో బలంగా మారింది. అంతేకాకుండా టీఆర్ఎస్ సర్కారు వైఫ్యల్యాలను ఎండగడుతూ ఢీ అంటే ఢీ అంటోంది.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. తన పార్టీ నుంచి బయటికి వెళ్లిన ఈటల రాజేందర్ ను బీజేపీ ఆపార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయన బీజేపీ పట్ల తన వైఖరి మార్చుకున్నట్లు కన్పిస్తోంది. గతంలో కేంద్ర చేసిన రైతు చట్టాలకు జై కొట్టిన కేసీఆర్ ఇప్పుడు వాటినే అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ ఫార్మూలాను సైతం సీఎం కేసీఆర్ తెలంగాణలో వాడేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ఆ పార్టీపై వ్యతిరేకత నెలకొంది. పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు సామాన్య, మధ్యతరగతికి ఇబ్బందులు తెచ్చుపెడుతున్నాయి. అలాగే రైతుల్లోనూ బీజేపీపై కొంత వ్యతిరేకత నెలకొంది. దీంతో ఆయా వర్గాలను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

దీనిలో భాగంగానే కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ఇటీవల మాటలు తూటాలు పేల్చుతున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీని స్ట్రాంగ్ గా ఎదుర్కొని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మమత బెనర్జీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీపై ఆమె పోరు కారణంగా అది కన్పించకుండా పోయింది. సేమ్ టు సేమ్ ఇదే ఫార్మూలాను కేసీఆర్ తెలంగాణలోనూ వర్కౌట్ చేయాలని భావిస్తున్నారు.

Also Read: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ పై కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన కేంద్రంతో పోరుకు సిద్ధమనే సంకేతాలిస్తూ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడేళ్లలో కేంద్ర సర్కారుపై ఉపయోగించని పదజాలాన్ని సైతం ఆయన ఇటీవల ప్రయోగిస్తుండం వ్యూహాంలో భాగమనేనని తెలుస్తోంది.

మొత్తంగా సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో బీజేపీకి మరిన్ని టాస్కులు ఇవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. మరోవైపు బీజేపీ సైతం కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మున్ముందు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.

Also Read: కేసీఆర్ కు కోవర్టుల భయం మొదలైందా?