
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం.. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కెసిఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
ఈ విందులో సీఎం కెసిఆర్, ట్రంప్ కుటుంబానికి తెలంగాణకు సంబంధించిన కొన్ని రుచులను పరిచయం చేయబోతున్నారు. ట్రంప్ కోసం స్పెషల్ గా నాటుకోడి పకోడీని స్పెషల్ గిఫ్ట్ గా ప్యాక్ చేయించి రుచి చూపించబోతున్నారు. దీంతో పాటుగా తెలంగాణలో బాగా ఫేమస్ అయిన మరికొన్ని వంటలను కూడా ట్రంప్ కుటుంబానికి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
విందు అనంతరం డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్‌లు తీసుకెళ్లారు కేసీఆర్… అమెరికా అధ్యక్షుడికి పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటోను అందించనున్నారు. ట్రంప్ సతీమణి మెలానియా, కూతురు ఇవాంక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను బహూకరించనున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలను అతి కొద్దిమంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ విందుకు ఆహ్వానం వచ్చింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉండటం విశేషం.