https://oktelugu.com/

Modi Amith Shaw: హైదరాబాద్ లోనే మకాం.. తెలంగాణపై మోడీ, అమిత్ షా ఫోకస్.. కేసీఆర్ టార్గెట్

Modi, Amit Shah focused on Telangana: తెలంగాణపైన బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ జాతీయ నేతలంతా హైదరాబాద్ లో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. జాతీయ రాజకీయాలపైన కేసీఆర్ అడుగులు వేస్తుండడం.. ప్రధాని-బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ సైతం కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఇందుకోసం రానున్న రోజుల్లో అగ్రనేతలు తెలంగాణలో మకాం వేయనున్నారు. ఇప్పటికే ఓసారి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని […]

Written By: , Updated On : June 1, 2022 / 03:26 PM IST
Follow us on

Modi, Amit Shah focused on Telangana: తెలంగాణపైన బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ జాతీయ నేతలంతా హైదరాబాద్ లో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. జాతీయ రాజకీయాలపైన కేసీఆర్ అడుగులు వేస్తుండడం.. ప్రధాని-బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ సైతం కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఇందుకోసం రానున్న రోజుల్లో అగ్రనేతలు తెలంగాణలో మకాం వేయనున్నారు.

ఇప్పటికే ఓసారి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ ను గద్దెదించడమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణపై నమ్మకంతోనే బీజేపీ నేతలు ఫుల్ ఫోకస్ చేశారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గాలను సైతం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును బీజేపీ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఉన్నా కూడా హైదరాబాద్ ను ఎంచుకోవడం వెనుక తెలంగాణలో అధికారమే లక్ష్యమని అర్థమవుతోంది. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడం.. బీజేపీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

జాతీయ కార్యవర్గ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. మూడు రోజులు వీరు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. పార్టీ యాక్టివిటీ హైదరాబాద్ కేంద్రంగా పెరగడం ద్వారా స్థానికంగా పార్టీ నేతల్లో .. కేడర్ లో కొత్త జోష్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ మూడు రోజుల సమావేశంలో హైదరాబాద్ తీర్మానం పేరుతో రాజకీయంగా కీలక అంశాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మూడురోజుల్లోనూ జాతీయ రాజకీయాలతోపాటుగా తెలంగాణ రాజకీయాలపైనా పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తే తెలంగాణలో అధికారం సాధ్యమనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టకూడదు.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పకూడదనే బీజేపీ ఈ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా తెలంగాణలో రాజకీయం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.