https://oktelugu.com/

KCR Politics on Petrol Price Hike: పెట్రోల్ ధర తగ్గాలంటే ఏం చేయాలి?

KCR Politics on Petrol Price Hike: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఈ ధరలు తగ్గాలంటే ఏం చేయాలి? మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయాలి? తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పెట్రో మంటకు కేంద్రమే కారణమని ఆరోపిస్తోంది. గత వారంలో ఆరు సార్లు పెట్రోల్ ధర పెరగడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ముడిచమురు ధర పెరిగి ఈ పరిస్థితి వచ్చిందని.. అందుకే పెట్రోల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2022 / 07:17 PM IST
    Follow us on

    KCR Politics on Petrol Price Hike: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఈ ధరలు తగ్గాలంటే ఏం చేయాలి? మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయాలి? తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పెట్రో మంటకు కేంద్రమే కారణమని ఆరోపిస్తోంది.

    KCR Politics on Petrol Price Hike

    గత వారంలో ఆరు సార్లు పెట్రోల్ ధర పెరగడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ముడిచమురు ధర పెరిగి ఈ పరిస్థితి వచ్చిందని.. అందుకే పెట్రోల్ ధరలు పెంచినట్టుగా కేంద్రప్రభుత్వం చెబుతోంది. ఉక్రెయిన్ యుద్ధమే కారణమా? ఆ కారణం చూపి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. దేశంలోని పార్టీలన్నీ బీజేపీనే ఇందులో విలన్ గా చూపిస్తున్నాయి. మరి బీజేపీదే తప్పా? అన్నది మనం ఇక్కడ సమీక్షించాలి.

    Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?

    అంతర్జాతీయ ధరలతో పోల్చినప్పుడు.. మన పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరలను పోల్చుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో మనలాగా పెట్రోల్ ధరలు లేవు. భారత ఉపఖండంలో అత్యధిక పెట్రోల్ రేట్లు మన భారత్ లోనే ఉన్నాయి. దీనికి అంతరంగిక బాదుడే అసలు కారణం. మరి ఈ సమస్య ఎక్కడుందన్నది ఇక్కడ ఆలోచించాలి.

    దేశంలో పెట్రోల్ ధరలు ఢిల్లీలో 100 రూపాయలు ఉంటే.. హైదరాబాద్ లో 114 రూపాయలు ఉంది. ఢిల్లీ కంటే తెలంగాణలో 14 రూపాయలు ఎక్కువగా ధరలున్నాయి. విశాఖలోనూ ఇదే రేటు. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ లు 14 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక దేశంలో అత్యధిక పెట్రోల్ రేట్లు ఉన్న 6 రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నవే. దీన్ని ఏం అనాలన్నది ఇక్కడ ప్రశ్న? దేశంలో పెట్రోల్ రాజకీయంలో ఎవరిది తప్పు అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    Also Read: Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?