https://oktelugu.com/

KCR Politics: టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చే స్కెచ్ వేసిన కేసీఆర్?

KCR Politics: గెలుస్తామని అనుకున్నప్పుడు ఏదీ చేసినా నడుస్తుంది. కానీ ఓడిపోతామన్న సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి.. కర్ర విరగకుండా పాము చచ్చేలా కొట్టాలి. అది కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు. తెలంగాణ సాధించిన పార్టీగా మొదటి సారి ప్రజల అభిమానం చూరగొని కొత్త రాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కేసీఆర్. అనంతరం తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చూపించి రెండోసారి క్లీన్ స్వీప్ మెజార్టీతో గెలిచాడు. అయితే మూడోసారి వరుసగా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2022 / 12:56 PM IST
    Follow us on

    KCR Politics: గెలుస్తామని అనుకున్నప్పుడు ఏదీ చేసినా నడుస్తుంది. కానీ ఓడిపోతామన్న సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి.. కర్ర విరగకుండా పాము చచ్చేలా కొట్టాలి. అది కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు. తెలంగాణ సాధించిన పార్టీగా మొదటి సారి ప్రజల అభిమానం చూరగొని కొత్త రాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కేసీఆర్. అనంతరం తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చూపించి రెండోసారి క్లీన్ స్వీప్ మెజార్టీతో గెలిచాడు.

    kcr bjp bandi revanth

    అయితే మూడోసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టడం అంత ఈజీ కాదన్న విషయం కేసీఆర్ కు అర్థమైంది. మరేం చేయాలి? ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేక ఓటును ఎలా అనుకూలంగా మలుచుకోవాలి.. అనుకూలంగా మలుచుకోవడం కష్టమని కేసీఆర్ తేలిపోయింది. రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్నా వారి కోరికలు తీర్చని కేసీఆర్ కు వ్యతిరేకులు ఓటు వేసే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

    టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఒక్క ప్రతిపక్ష పార్టీ వైపు వెళితే అది కేసీఆర్ ఓటమికి దారితీస్తుందన్న విషయం ఆయనకు తెలుసు. అదే రెండు, మూడు పార్టీల వైపుకు తిరిగితే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలి అది టీఆర్ఎస్ కే లాభం అవుతుంది.

    ఈ క్రమంలోనే కేసీఆర్ బీజేపీని ప్రతిపక్ష పార్టీగా ప్రమోట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న బీజేపీ-టీఆర్ఎస్ యుద్ధంపై ఇదే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అందుకే వ్యూహాత్మకంగా బీజేపీకి లేనిపోని హైప్ కేటాయించి ఆ పార్టీకి కాస్త ఊపు తెచ్చే అవకాశం కల్పిస్తున్నారని విశ్లేషించారు. ఎందుకంటే అధికార ఓట్ల చీలిక కోసం అంటున్నారు.

    తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు. నేతల బలం లేదు. హుజూరాబాద్ లో గెలిచిందంటే ఈటల రాజేందర్ వల్లే.. దుబ్బాకలో రఘునందన్ రావు వల్లనే బీజేపీ గెలిచింది. అదే బలం లేని దక్షిణ తెలంగాణలోని హుజూర్ నగర్ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. అక్కడ అసలు బీజేపీకి క్యాండిడేట్ లేడు.

    తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గ ఎమ్మెల్యేస్థాయి నేతలున్నారు. దాదాపు ప్రతీగ్రామంలోనూ నాయకులు, క్షేత్రస్థాయి క్యాడర్ ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక ఆ పార్టీకి ఊపు వచ్చింది. కాంగ్రెస్ బలంగా తయారైంది. అందుకే కేసీఆర్ వ్యూహం మార్చి బీజేపీని ప్రమోట్ చేస్తున్నారు. త్రిముఖ పోటీ వచ్చేలా చూసుకుంటే ఓట్ల చీలిక అనివార్యమై టీఆర్ఎస్ కు లాభిస్తుందని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    కాంగ్రెస్ లో కుమ్ములాటలు.. రేవంత్ రెడ్డిని నేతలు వ్యతిరేకిస్తున్న తీరు చూస్తే కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే. కాంగ్రెస్ సగం ఓట్లు.. బీజేపీ సగం ఓట్లు చీలిస్తే టీఆర్ఎస్ గెలుస్తుంది. అందుకే కేసీఆర్ పక్కా ప్రణాళికతోనే బీజేపీని పైకి లేపుతున్నట్టు తెలుస్తోంది.

    Tags