KCR Politics: వచ్చేసారి గెలుపు కోసం కేసీఆర్ కఠిన నిర్ణయం.. ?

KCR Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సార్లు అధికారం కొల్లగొట్టారు. మొదటి సారి తెలంగాణ సాధించిన ఘనతతో.. రెండోసారి చేసిన అభివృద్ధితో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సహజంగానే ఆయనపై వ్యతిరేకత ఇప్పుడు పెల్లుబుకుతోంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు.. పనులన్నీ పెండింగ్ లో పడిపోవడం.. ఉద్యోగాల ప్రకటన లేకపోవడం.. అభివృద్ధి మందగించడం ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు గడ్డు పరిస్థితులే ఎదురవబోతున్నాయి. కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత వల్లే హుజూరాబాద్ […]

Written By: NARESH, Updated On : December 5, 2021 11:40 am
Follow us on

KCR Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సార్లు అధికారం కొల్లగొట్టారు. మొదటి సారి తెలంగాణ సాధించిన ఘనతతో.. రెండోసారి చేసిన అభివృద్ధితో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సహజంగానే ఆయనపై వ్యతిరేకత ఇప్పుడు పెల్లుబుకుతోంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు.. పనులన్నీ పెండింగ్ లో పడిపోవడం.. ఉద్యోగాల ప్రకటన లేకపోవడం.. అభివృద్ధి మందగించడం ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు గడ్డు పరిస్థితులే ఎదురవబోతున్నాయి. కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత వల్లే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కఠిన నిర్ణయాల దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

KCR Politics

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుగాలి ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీకి వ్యతిరేకత బాగా ఉందని అర్థమవుతోంది. ఇది గ్రహించిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో 60శాతానికి పైగా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మంచి ట్రాక్ రికార్డ్ ఉండి.. ఆయా నియోజకవర్గాల్లో పట్టు ఉన్న, విజయావకాశాలు ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తారని తెలిసింది.

అసమ్మతి అసంతృప్తి.. సరిగ్గా పనిచేయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ తొలగించబోతున్నట్టు తెలిసింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ ఇమేజ్ తో పూర్తిగా కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆర్థికసామర్థ్యం, స్థానికంగా పలుకుబడి కలిగి ఉన్నారని ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.. దీనివల్ల వ్యతిరేకత కొంత మేర తగ్గుతుందని కేసీఆర్ చేసిన సర్వేలో తేలినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారని.. ఎలాంటి అధికార వ్యతిరేకత లేదని.. కానీ ఆశించిన స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని.. వారిపైనే వ్యతిరేకత ఉన్నట్టు కేసీఆర్ చేయించిన సర్వేలో తేలిందట.. కాబట్టి కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే.. కనీసం ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై ప్రతికూల ఓట్లు కూడా సానుకూలంగా మారవచ్చని కేసీఆర్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

2018 డిసెంబర్ లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. నాడు అందరు సిట్టింగులతోపాటు ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. తొలిసారి గెలిచిన వారినే కొనసాగించారు. వారిలో 90శాతం మంది కేసీఆర్ నమ్మకాన్ని అంచనాలను నిలబెట్టి గెలవడం విశేషం.

Also Read: అంతర్మథనంలో మాట‌ల మాంత్రికుడు.. కేసీఆర్ వ్యూహం అదేనా..?

అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే వ్యూహం అమలు చేసినా బెడిసికొట్టింది. మళ్లీ పార్టీ టిక్కెట్ ఇచ్చిన సిట్టింగ్ కార్పొరేటర్లందరూ ఓడిపోయారు. తాజాగా టిక్కెట్ పొందిన వారు విజయం సాధించారు. దీంతో ఇదే వ్యూహాన్ని కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

అయితే కేసీఆర్ కు దీనివల్ల మరో బాధ కూడా ఉంది. టిక్కెట్లు దక్కిని సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారి అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలతో చెలగాటమాడే ప్రమాదం ఉంది. అది ప్రతిపక్ష పార్టీలకు మేలు చేస్తుంది. ఈ రెబల్ సమస్యను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది వేచిచూడాలి.

Also Read: ధాన్యం కొనుగోళ్లు.. రాజ్యసభలో టీఆర్ఎస్ కథ బట్టబయలు

Tags