https://oktelugu.com/

కేసీఆర్ లక్షల కోట్లు.. ఎవరికి పాట్లు

హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా పలు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని విశ్లేషకుల అంచనా. రాష్ర్టంలో బడ్జెట్ వేల కోట్లలో ఉంటే లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడం ఓ అద్భుత అబద్దంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో లేని డబ్బులను ఎక్కడి నుంచి తెస్తారు. అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో […]

Written By: , Updated On : July 25, 2021 / 07:39 PM IST
Follow us on

TS CM KCR Dalit Bandhu Scheme

హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా పలు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని విశ్లేషకుల అంచనా. రాష్ర్టంలో బడ్జెట్ వేల కోట్లలో ఉంటే లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడం ఓ అద్భుత అబద్దంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో లేని డబ్బులను ఎక్కడి నుంచి తెస్తారు. అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే తపనతో అమలుకు వీలు కాని హామీలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు సైతం కన్నెర్ర జేస్తున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ విచిత్రమైన హామీలు గుప్పిస్తూ ప్రజల్లో చులకన అయిపోతోంది. ఎందుకంటే లక్ష కోట్ల బడ్జెట్ అనేది అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా దొంగతంన చేస్తే తప్ప ఇంత భారీ మొత్తంలో సొమ్ము లభించదని తెలిసినా హామీలివ్వడం వెనుక ఆంతర్యమేమిటి?

దళితులను లక్ష్యంగా చేసుకుంటే మిగిలిన వర్గాలు ఎటు వెళ్లాలి. బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రయోజనం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. గతంలో ఇచ్చిన హామీల సంగతేంటని అడుగుతున్నారు. పాలకులు ప్రకటించిన పథకాల వివరాలు వింటేనే ఏదో విధంగా ఉంటున్నాయని పెదవి విరుస్తున్నారు.

రాజకీయాల కోసం ఇంత దారుణానికి ఒడిగడుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటోంది. ఇవన్నీ చేస్తే సామాన్యుడి మీదే భారం పడుతుంది. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం ఎందుకు సాహసం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్రోధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ భారం ఎవరి తల మీద పెడతారో వేచి చూడాల్సిందే.