https://oktelugu.com/

ABN RK KomatiReddy: కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయి.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

ABN RK KomatiReddy: తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయని.. ఆయన అధికారం కోల్పోయిన మరుక్షణం జైలుకు పోవడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల వద్ద ఈ ఫైల్ ఉందని.. ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కు చిక్కులు తప్పవని అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 07:29 PM IST
    Follow us on

    ABN RK KomatiReddy: తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయని.. ఆయన అధికారం కోల్పోయిన మరుక్షణం జైలుకు పోవడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల వద్ద ఈ ఫైల్ ఉందని.. ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కు చిక్కులు తప్పవని అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సునిశిత ప్రశ్నలకు కోమటిరెడ్డి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

    తరచూ కాంగ్రెస్ పార్టీ మారుతారన్న వార్తలపై కూడా కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. తాను పుట్టింది కాంగ్రెస్ లోనని.. పెరిగింది కాంగ్రెస్ లోనని.. చచ్చేది కూడా ఇదే పార్టీలోనని స్పష్టం చేశారు. తన జీవితం ఆశయం కేసీఆర్ ను గద్దెదింపడమని చెప్పుకొచ్చారు.

    టీపీసీసీ చీఫ్ పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్ గడప తొక్కనన్న వెంకటరెడ్డి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. తనతోపాటు సీనియర్లు చాలా మంది టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించారని.. తమను కాదని ఇతర పార్టీలోని జూనియర్లకు ఇవ్వడాన్నే సహించలేక అలా అన్నామని కోమటిరెడ్డి అన్నారు.

    కేసీఆర్ సహా బీజేపీ నుంచి పార్టీలోకి రావాలని ఎన్నో ఆహ్వానాలు, ఆఫర్లు వచ్చాయని.. తనను కౌగిలించుకొని సన్నిహితంగా ఉండడాన్ని చూసి అందరూ తాను పార్టీ మారుతున్నానని అనుకున్నారని కోమటిరెడ్డి అన్నారు.

    ఇక తనకు తన తమ్ముడు తీరుతో నష్టం జరిగిందని.. పార్టీ మారే వాళ్లను రాళ్లతో కొట్టి పిచ్చోళ్లలాగా చేయాలని.. వారికి టికెట్లు ఇవ్వవద్దని కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాదో తెలియకుండానే సీఎం సీటు కోసం 12 మంది పోటీలో ఉంటారని.. అలాంటి పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నకు ఆసక్తిగా స్పందించారు. కనీసం ఒక పదివేల ఓట్లు కూడా సంపాదించుకోలేని నేతలు కూడా సీఎంలుగా అనుకుంటున్నారని.. కనీసం ఒక కుటుంబం ఓట్లు కూడా వాళ్లు సంపాదించలేరని ఆరోపించారు.

    కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ ఫైట్ అన్నది నాటకం అని.. బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని.. కాంగ్రెస్ ను ఓడించేందుకే ఈ కథ అంతా అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యంఠాగూర్ సైతం టీఆర్ఎస్ తో పొత్తు లేదని కాంగ్రెస్ నేతల్లో అనుమానాలకు బీజం పోస్తున్నాడని సొంతపార్టీ అధినేతను సైతం కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు.

    కేసీఆర్ ను జైలుకు పంపడమే ధ్యేయమని.. అవినీతి చేస్తే అధికారి అయినా ఎవడైనా జైలుకు వెళ్లాల్సిందేనని.. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తామని కేసీఆర్ కు కోమటిరెడ్డి సంచలన హెచ్చరికలు పంపారు. ఢిల్లీలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతిపై ఆధారాలు పెండింగ్ లో ఉన్నాయని ఎవరు ఆపుతున్నారో తెలియడం లేదని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణలో ఎలుకలు కొరికి చచ్చిపోతుంటే బయట పరువు పోతోందని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు.

    ఆయన అభిప్రాయాలతో కూడిన ప్రోమో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పెనుదుమారం రేపుతోంది. దాని ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. అప్పటివరకూ కోమటిరెడ్డి ఏం చెప్పారు? ఎలాంటి సంచలనాలు బయటపెట్టాడన్న పూర్తి ఎపిసోడ్ ను అందులో చూడొచ్చు.

    Tags