https://oktelugu.com/

‘ధరణి’ ఆన్ లైన్ నమోదుపై కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌.. ఏదైనా అనుకున్నారంటే అది సాధించే వరకూ వదలడు. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులను పెట్టి మరీ ఆ పని కానిచ్చేస్తారు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తున్నా.. తన ప్లానింగ్‌ను మాత్రం మార్చుకోరు. ఇటీవల సచివాలయం నిర్మాణంలో అదే స్పీడ్‌ కనిపించింది కూడా. Also Read: కవితకు ఇప్పుడే నో ఛాన్స్‌? అయితే.. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన ధరణి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 11:22 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌.. ఏదైనా అనుకున్నారంటే అది సాధించే వరకూ వదలడు. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులను పెట్టి మరీ ఆ పని కానిచ్చేస్తారు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తున్నా.. తన ప్లానింగ్‌ను మాత్రం మార్చుకోరు. ఇటీవల సచివాలయం నిర్మాణంలో అదే స్పీడ్‌ కనిపించింది కూడా.

    Also Read: కవితకు ఇప్పుడే నో ఛాన్స్‌?

    అయితే.. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన ధరణి పోర్టల్‌లో ఆ స్పీడ్‌కు బ్రేక్ పడింది. దసరాలోపు సర్వే కంప్లీట్‌ చేసి.. దసరా రోజు ధరణి పోర్టల్‌ ప్రారంభించాలని అనుకున్న కేసీఆర్‌‌ ఆశయానికి ఆ స్థాయిలో రిజల్ట్‌ రాలేదు. 15 రోజుల్లోగా తెలంగాణలో ఆస్తుల వివరాలన్నింటినీ నమోదు చేయాల్సిందేనంటూ డెడ్‌లైన్‌ పెట్టాడు. కానీ.. చివరకు కేసీఆర్‌‌కు కోర్టులో చుక్కెదురైంది. కోర్టు గట్టిగా కోరే సరికి.. ఏకంగా మాట మార్చేశారు. వ్యవసాయేతర వివరాలు నమోదు చేసేందుకు నిర్దిష్ట గడువు ఏమీ లేదని.. అది నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు.

    మరి.. ఈ గడువు లేని సర్వేకు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నట్లు..? రాష్ట్ర ప్రజలందరినీ అంత ఆగమాగం ఎందుకు కోరుతున్నట్లు..? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలివి. ప్రభుత్వం హైకోర్టులో చెప్పిన మాటలతో క్షేత్రస్థాయిలో సర్వే స్పీడ్‌లోనూ స్లో కనిపిస్తోంది.

    Also Read: చంద్రబాబు సైడ్‌.. చినబాబుకే స్టీరింగ్..

    ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తీసుకున్న ఈ నిర్ణయం మీద ముందు నుంచీ అటు ప్రజల నుంచి.. ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆస్తుల వివరాలు చెప్పేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. పోనీ.. ఆ సర్వేలోనూ అన్నీ నిజాలే చెబుతారన్న నమ్మకం లేదు. కానీ.. ధరణి పోర్టల్‌ తెచ్చిన తర్వాత ఆస్తులు చెప్పకపోతే.. వాటిపై హక్కు కోల్పోతారంటూ ప్రభుత్వం ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత భయమైతే కనిపించింది. బినామీల పేరుతో ఆస్తులు పోగేసుకున్నవారు అల్లాడిపోయారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పిందో అప్పటి నుంచి ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందే. ఎందుకంటే.. భవిష్యత్తులో ఈ భూముల గొడవలు ఉండకూడదనే లక్ష్యంతోనే కేసీఆర్‌‌ ఈ స్టంట్‌ తీసుకున్నారు. కానీ.. చివరికి ఇలా మాట మార్చడంతో ఆ సర్వే పై ప్రజల్లోనూ నమ్మకాలు పోయాయి. ఈ నేపథ్యంలో సర్వే దసరాలోపు కంప్లీట్‌ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.