https://oktelugu.com/

CM KCR: బీజేపీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర పక్షాలతో భేటీ

CM KCR:  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రాష్ర్టంలో బీజేపీ బలపడుతుందని భావించిన టీఆర్ఎస్ దాన్ని ఎదుర్కొనే క్రమంలో పలు వ్యూహాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలును అస్ర్తంగా చేసుకుని ఎదురుదాడి చేయాలని భావిస్తోంది. దీని కోసమే పలు కోణాల్లో ప్రణాళికలు వేస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్లమెంట్ వేదికగా బీజేపీ విధానాలు ఎండగట్టాలని ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2021 / 08:02 PM IST
    Follow us on

    CM KCR:  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రాష్ర్టంలో బీజేపీ బలపడుతుందని భావించిన టీఆర్ఎస్ దాన్ని ఎదుర్కొనే క్రమంలో పలు వ్యూహాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలును అస్ర్తంగా చేసుకుని ఎదురుదాడి చేయాలని భావిస్తోంది. దీని కోసమే పలు కోణాల్లో ప్రణాళికలు వేస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్లమెంట్ వేదికగా బీజేపీ విధానాలు ఎండగట్టాలని ప్రయత్నాలు చేసింది.

    KCR

    ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీ ఆగడాలను ఎండగడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, బీజేపీ మధ్య దూరం మరింత పెరిగిపోతోంది. రాష్ర్టంలో బీజేపీకి అధికారం వస్తే తమ పరిస్థితి ఏంటనే అనుమానంలో పడిపోయారు. గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడం తెలిసిందే.

    దీంతో రెండు పార్టీల్లో విమర్శల దాడి పెరుగుతోంది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో కేసీఆర్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి చర్చలు జరపనున్నట్లు సమాచారం. దీంతో బీజేపీని అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Justice Chandru: జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు

    బీజేపీని ఏకాకిగా చేయాలనే తలంపుతోనే కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో మరోమారు అధికారం చేపట్టకుండా చేయాలనే చూస్తోంది. ఇందుకుగాను అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని సాకుగా చూపుతూ కేంద్రంపైనే నిందలు వేయాలని పావులు కదుపుతోంది. మొత్తానికి రాష్ర్టంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా చేస్తుందని తెలుస్తోంది.

    Also Read: Bhakti: సీఎం కేసీఆర్ ‘భక్తి’ రాజకీయం చేయబోతున్నారా?

    Tags