CM KCR: ఊరికే మౌనం వహించరు మహానుభావులు అని.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం ఎప్పుడూ ప్రమాదకరమే.. ఆయన అలా సైలెంట్ గా ఉన్నారంటే వెనుకాల ఏందో బాంబు చుట్టి పెడుతున్నట్టే లెక్క. చాలా సందర్భాల్లో ఇలా మౌనంగా ఉండి బయటకు వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటారు. కేసీఆర్ వ్యూహాత్మక మౌనాలు చాలా డేంజర్ అని రాజకీయ వర్గాల్లో పేరుంది.
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్, దిశ ఎన్ కౌంటర్.. అంతకుముందు చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసు అప్పుడు కూడా కేసీఆర్ ఇలానే వ్యూహాత్మక మౌనం దాల్చి సంచలనం సృష్టించారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఇలానే చేశారు. సడెన్ గా రాజీనామాలు చేసి ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్లారు.. ప్రతిపక్షాలకు కనీసం సర్దుకునే చాన్స్ ఇవ్వకుండానే గెలిచేశారు.
Also Read: Rushikonda Mining: రుషికొండ విధ్వంసాన్ని ఆపండి.. జగన్ సర్కారుకు ఎన్ జీటీ ఝలక్
ఇప్పుడు కూడా కేసీఆర్ గత కొద్దిరోజులుగా బయటకు రావడం లేదు. పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. పీకే వచ్చి కలిసి వెళ్లక ముందు నుంచి ఆయన ఫాంహౌస్ లోనే వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండడం విశేషం. మధ్యలో ఓ సారి ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. రెండు వారాలు ఉంటారని అంతా సిద్ధమయ్యాక.. టూర్ క్యాన్సిల్ చేశారు.
జాతీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ ఈ మేరకు వ్యూహాల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న విషయంలో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీకి తగినంత మెజార్టీ లేదు. టీఆర్ఎస్, వైసీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కీలకమవుతాయి. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిస్తే కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు తెలిపినట్లే. అది రాష్ట్రంలో టీఆర్ఎస్ కు భారీ నష్టం. ఇక బీజేపీ ప్రకటించే అభ్యర్థికి మద్దతు తెలిపితే ఇంతకాలం ఆ పార్టీపై కొట్లాడిన కేసీఆర్ శ్రమ అంతా వృథా అవుతుంది.
అందుకే కేసీఆర్ తాజాగా ప్రాంతీయపార్టీల తరుఫున ఓ అభ్యర్థిని ప్రకటించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధిపతులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకోవడంతో ఆయనకు కేంద్రంలోని మోడీ సర్కార్ అప్పులు పుట్టనీయడం లేదట.. దీంతో ఈసారి జీతాలకు తెలంగాణ ప్రభుత్వం అగచాట్లు పడుతుందని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కు ఉన్న అన్ని దారులు మూసేస్తూ బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎలా వెళితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయి? ఎలా ముందుకెళ్లాలన్న విషయంలో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. బీజేపీకి భయపడి కేసీఆర్ ప్లాన్లు మార్చుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమాకు అసలు కారణం అదే?
Recommended Videos