https://oktelugu.com/

కేసీఆర్ బడ్జెట్‌ భారం తగ్గించుకుంటున్నారు

మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఆర్థిక అవసరాల కోసం కేంద్రం మీదనో.. దాతల మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి. మొదట్లో ఎప్పుడూ భారీ బడ్జ్‌ట్‌ ప్రవేశపెట్టే తెలంగాణ ప్రభుత్వం రానురాను తగ్గిస్తూ వస్తోంది. ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడంతో సీఎం కేసీఆర్‌‌ రాష్ట్ర పద్దును మళ్లీ తగ్గిస్తున్నారు. Also Read: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..? దీనికితోడు ఈసారి కరోనా కూడా ఆర్థిక వ్యవస్థను భారీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 04:13 PM IST
    Follow us on

    మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఆర్థిక అవసరాల కోసం కేంద్రం మీదనో.. దాతల మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి. మొదట్లో ఎప్పుడూ భారీ బడ్జ్‌ట్‌ ప్రవేశపెట్టే తెలంగాణ ప్రభుత్వం రానురాను తగ్గిస్తూ వస్తోంది. ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడంతో సీఎం కేసీఆర్‌‌ రాష్ట్ర పద్దును మళ్లీ తగ్గిస్తున్నారు.

    Also Read: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..?

    దీనికితోడు ఈసారి కరోనా కూడా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌ను కేసీఆర్ భారీగా తగ్గించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గిపోయిందని కారణం చెప్పారు. అయితే.. మార్చిలో కాస్త తగ్గినా ఓ రేంజ్ బడ్జెట్‌నే ప్రవేశ పెట్టారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు మళ్లీ మొత్తం బడ్జెట్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. కానీ.. ఆదాయం అంతగా ఊపందుకోలేదు. కేంద్రం నుంచి నిధుల రాక కూడా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఆదాయం కాస్త మెరుగుపడుతోంది. అయితే.. ఈ ఆదాయం కాస్త బడ్జెట్ అంచనాలను అందుకునే పరిస్థితి లేదని అధికారవర్గాలు అంచనాకు వచ్చాయి.

    2020–-21వ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లుగా అంచనా వేసి, అసెంబ్లీలో ఆమోదించారు. ఏడు నెలల కాలంలో రూ.60 వేల కోట్ల నిధుల వరకు మాత్రమే వ్యయం చేశారు. అందుకే సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను రివైజ్ చేయాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఏయే శాఖకు ఎంత కేటాయించాల్నో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు అధికారులు కూడా అదే పనిలో మునిగిపోయారు.

    Also Read: బాలయ్య అల్లుడి ‘గీతం వర్సిటీ’కి షాకిచ్చిన జగన్ సర్కార్

    ఏ స్థాయిలో ఆదాయం పెరిగినా.. ఎన్ని అప్పులు చేసినా బడ్జెట్‌లో అంచనా వేసిన విధంగా రూ.1.82 లక్షల కోట్ల నిధులను ఈ ఏడాదిలో వ్యయం చేసే పరిస్థితి లేదు. అందుకే వివిధ శాఖలకు కేటాయించిన మొత్తంలో పెద్ద ఎత్తున కోత పెట్టే అవకాశం కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే బడ్జెట్‌ భారం తగ్గించుకోవడమే మేలని కేసీఆర్‌‌ భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది.