https://oktelugu.com/

KCR: కేంద్రంపై 23 పాయింట్లతో అటాక్ చేయబోతున్న కేసీఆర్.. ప్లాన్ అదిరింది

KCR:  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీపై పోరు ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలు నుంచి ఈ పోరాటం షురూ కాగా, ఇకపై బీజేపీ ప్రభుత్వంపైన గట్టిగానే పోరాడబోతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వారికి వివరించారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా 23 పాయింట్ల ఎజెండాను కేసీఆర్ రూపొందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 31, 2022 / 02:51 PM IST
    Follow us on

    KCR:  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీపై పోరు ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలు నుంచి ఈ పోరాటం షురూ కాగా, ఇకపై బీజేపీ ప్రభుత్వంపైన గట్టిగానే పోరాడబోతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వారికి వివరించారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా 23 పాయింట్ల ఎజెండాను కేసీఆర్ రూపొందించారు.

    KCR strategy

    రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎంపీలు చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపైన వారికి కేసీఆర్ పలు సూచనలు చేశారు. రాష్ట్ర హక్కులకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం భేటి గురించి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మీడియాకు వివరించారు.

    Also Read:  రాత్రి అందుకోసమే వస్తుంది.. అనుపమ షాకింగ్ కామెంట్స్ !

    అలా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన విభజన అంశాలను టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ప్రస్తావించనుంది. మొత్తంగా 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో కీలక చర్చ జరిగింది. ఈ 23 అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపైన కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2022 కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం మరింత గట్టిగా టీఆర్ఎస్ పోరాడుతుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజైన జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

    CM KCR

    ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. బీజేపీపైన ఇకపై టీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్ కార్నర్ చూపబోదని, కయ్యానికి దిగాల్సిందేనన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు ఏ మేరకు పోరాడుతారో చూడాలి మరి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన విషయాలపైన బడ్జెట్ లో ఏ మేరకు కేటాయింపులు చేస్తుంది.?.. దానిపైన తెలంగాణ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలంటే ఇంకో రెండు లేదా మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

    Also Read:  పుష్ప ప్రమోషన్స్ కోసం అలా చేశారా.. అందుకే క్రికెటర్లు డాన్స్ చేస్తున్నారా..?

    Tags