Revanth Reddy: రేవంత్ రెడ్డి… ఓ సామాన్య కార్యకర్తగా కెసిఆర్ నీడలోనే ఎదిగారు. కానీ ఆశించినంత గుర్తింపు లభించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనతి కాలంలోనే తనకు తాను నిరూపించుకున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ప్రయాణంలో ఎక్కువగా ముళ్ళు, కొండలను దాటుకెళ్లారు. తెలంగాణ సమాజంలో ఓ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు.
ఎన్ని కేసులు నమోదైతే రాజకీయ నాయకుడికి అంత గుర్తింపు లభిస్తుందన్న రోజులు ఇవి. ఇది రేవంత్ రెడ్డి తో తేటతెల్లమైంది. రేవంత్ పై తెలంగాణలో 80 కేసులు ఉన్నాయి. అయితే ఓ స్థాయి నాయకుడిగా గుర్తింపు ఇచ్చిన కేసు మాత్రం ఓటుకు నోటు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కోవట్ ఆపరేషన్ తో కెసిఆర్ ట్రాప్ లో రేవంత్ పడ్డారు. కెమెరాలు పెట్టి స్పాట్లో అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని నిజంగా హీరో చేసింది ఈ ఘటనే. అప్పట్లో రేవంత్ చేసిన చాలెంజ్ లు విపరీతంగా వైరల్ అయ్యాయి.
రేవంత్ చేసింది తప్పే. ఓ ఎమ్మెల్సీ ని ప్రలోభ పెట్టడం తప్పిదమే. అదే సమయంలో కేసీఆర్ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. తాను చేస్తే లోక కళ్యాణం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో కెసిఆర్ వ్యవహరించారు. రేవంత్ రెడ్డి పై ఉక్కు పాదం మోపారు. కనీసం రేవంత్ కుమార్తె పెళ్లి అని కూడా చూడలేదు. కేవలం 12 గంటల బెయిల్ పై ఆయన వచ్చి పెళ్లికి హాజరై తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రేవంత్ కు ప్రజల్లో సానుభూతి పెరగగా.. ఆయనలో సైతం ఒక రకమైన కసిని పెంచాయి.
ఒక్కోసారి మన పట్టుదలే విజయతీరాలకు చేర్చుతుంది. రేవంత్ విషయంలో సైతం ఆయన పట్టుదలే పనిచేసింది. అందరు నేతలు కేసీఆర్కు లొంగిపోయారు. కానీ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం ఎదురు నిలిచి పోరాడారు. ఒకానొకదశలో రేవంత్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎలా నామినేషన్ వేసారో లేదో ఆయన ఇంటిపై ఐటి,ఈడి దాడులు చేశాయి. మూడు రోజులపాటు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. బయట మీడియాలో రేవంత్ పై విస్తృతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. లేనిపోని నిందారో పనులు పెట్టారు. ఒక రకమైన ఫ్రీ ప్లాన్ తో ప్రచారం చేశారు. రేవంత్ ఓటమికి కారణమయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ ను కెసిఆర్ టార్గెట్ చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న క్రమంలో కోవర్ట్ ఆపరేషన్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ అధిగమించి టిపిసిసి అధ్యక్ష పీఠంపై రేవంత్ కూర్చున్నారు. అయినా సరేరేవంత్ చుట్టూ కుట్రలు ఆగలేదు. కుతంత్రాలు మానలేదు. అయినా సరే మొక్కవోని దీక్షతో, ధైర్యంతో రేవంత్ అడుగులేసారు. అనుకున్నది సాధించారు. ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటారు అంటారు. కానీ రేవంత్ విజయం వెనుకకెసిఆర్ ఉన్నారు.