Modi vs KCR : ప్రధాని మోడీతో కేసీఆర్ కు సంధి లేదు.. సమరమే.. రుజువు ఇదిగో!

Modi vs KCR :  సంధియా.? సమరమా? ఈ రెండింటిలో ఏది బెటర్ అని బాగా ఆలోచించిన కేసీఆర్ ప్రధాని మోడీతో సమరానికే రెడీ అయ్యారు. మాటలు చెప్పడమే కాదు.. ఈరోజు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కు వస్తున్న మోడీని స్వాగతించకుండా షాక్ ఇచ్చాడు. మోడీతో తనది పైకి మాత్రమే వైరం కాదని.. లోపల కూడా వైరమే అని నిరూపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్రబడ్జెట్ పై విమర్శలు గుప్పించి ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. […]

Written By: NARESH, Updated On : February 4, 2022 11:12 pm
Follow us on

Modi vs KCR :  సంధియా.? సమరమా? ఈ రెండింటిలో ఏది బెటర్ అని బాగా ఆలోచించిన కేసీఆర్ ప్రధాని మోడీతో సమరానికే రెడీ అయ్యారు. మాటలు చెప్పడమే కాదు.. ఈరోజు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కు వస్తున్న మోడీని స్వాగతించకుండా షాక్ ఇచ్చాడు. మోడీతో తనది పైకి మాత్రమే వైరం కాదని.. లోపల కూడా వైరమే అని నిరూపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్రబడ్జెట్ పై విమర్శలు గుప్పించి ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలంటూ గళమెత్తారు. కేసీఆర్ ప్రెస్ మీట్ జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే బీజేపీ-టీఆర్ఎస్ తెరవెనుక ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరిగిందని అంతా అనుకున్నారు. కానీ మోడీతో సంధి లేదు.. ఇక సమరమేనని తేలిపోయింది. తాజా పరిణామంతో మోడీని కేసీఆర్ నిజంగానే సీరియస్ గా తిట్టాడని కన్ఫమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లే అవకాశం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో మోడీతో కేసీఆర్ ది నిజమైన ఫైట్ అని రుజువైంది.

Modi KCR

పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్‌మెంట్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీని స్వాగతించాలని.. ఆయన పర్యటనలో పాల్గొనాలని ఆదేశించినట్టు సీఎంవో అధికారికంగా తెలిపింది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాధారణ పరిపాలన విభాగం (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిన సమాచారం ప్రకారం.. ప్రధాన మంత్రిని స్వాగతించడానికి మరియు ఆయన పర్యటనలో పాల్గొనడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ పంపడానికి కేసీఆర్ ఆదేశించారు. మోడీ రాక -నిష్క్రమణలో పాల్గొనాలని సూచించారు..

2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్.. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని ఆహ్వానించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారతదేశంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌ని సందర్శించిన మోడీ చివరిసారిగా నవంబర్ 28, 2020న హైదరాబాద్‌ కు వచ్చారు. అయితే, ఆ సమయంలో ప్రధానిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమాచారం అందించింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మరికొందరు అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. అప్పుడు మోడీయే కేసీఆర్ రావద్దనడం హాట్ టాపిక్ గా మారింది.

నగర శివార్లలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) క్యాంపస్ 50వ వార్షికోత్సవ వేడుకలలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం ముచ్చింతల్‌లోని రామానుజాచార్య ఆశ్రమంలో జరిగే కార్యక్రమంలో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం 11వ శతాబ్దపు భక్తి సన్యాసి శ్రీ రామానుజాచార్య స్మారక చిహ్నం. నిజానికి మోడీతోపాటు కేసీఆర్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మోడీ సర్కార్ ను కేసీఆర్ తీవ్రంగా తిట్టిపోశారు. నాడు ప్రెస్ మీట్ లోనూ హైదరాబాద్ వచ్చే మోడీని స్వాగతిస్తానన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన స్థానంలో పంపుతున్నాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సమతా ఆశ్రమంలో ప్రధానితో వేదిక పంచుకునే అవకాశం లేదు. ఈ మేరకు సూచనలు చేస్తూ రామానుజ సహస్రాబ్ది సమరోహ ఉత్సవాల్లో గురువారం కేసీఆర్ ఆశ్రమాన్ని సందర్శించి భారీ విగ్రహాన్ని చూసి వచ్చారు.

సోమవారం పార్లమెంట్‌లో 2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో దాడి చేసిన దృష్ట్యా, ప్రధానిని మళ్లీ స్వాగతిస్తే ఆ తిట్టినదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

ఏ రాష్ట్రంలోనైనా ప్రధాని వచ్చినా ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం పలుకుతారని, ఇది రొటీన్‌గా జరిగే విషయమే.. ప్రొటోకాల్‌ అవసరం.. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని కేసీఆర్ మొన్న అన్నారు. ప్రధానితో వేదిక పంచుకుంటారా అని అడిగితే కేసీఆర్ సమర్థించుకున్నారు. “ఇది నా విధానం. నరేంద్ర మోడీతో పాటు ఆయన హెలికాప్టర్‌లో కూర్చున్నప్పుడు కూడా నేను ఇదే చెబుతాను” అని కేసీఆర్ అన్నారు.

మోడీని హైదరాబాద్ వస్తే ఆహ్వానిస్తానన్న కేసీఆర్ సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికే కేసీఆర్ పై జాతీయస్థాయిలో ‘మాట మీద నిలబడరని..’ ఏ అవసరార్థం ఆ రాజకీయం చేస్తాడని.. మోడీని తిట్టి మళ్లీ కలిసిన సందర్భాలున్నాయని.. కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్న అపవాదు ఉంది. దాన్ని చెరిపివేయడానికి.. మోడీతో నిజంగానే ఢీకొంటున్నానని తెలుపడానికి.. ప్రజలు, జాతీయ స్థాయి నేతల్లో తన చిత్తశుద్ధిని నిరూపించడానికే కేసీఆర్ తాజాగా మోడీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా జరిగినట్టు అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో మోడీ గెలిస్తే ఈ దూరం పెరిగుతుంది. ఒకవేళ మోడీ గెలిస్తే మళ్లీ కేసీఆర్ పంతా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.