https://oktelugu.com/

KCR Politics: ఆ వ్యతిరేక ముద్ర పోగొట్టుకునేందుకు కేసీఆర్ మరో ప్లాన్

KCR Politics: కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడ్డారు.  తాజాగా  ఎస్టీ రిజర్వేసన్‌ రగడను తాజాగా తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.. గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటి నుంచి తప్పించుకునేందుకు ఎస్టీ రిజర్వేషన్‌ అంశాన్ని అమలు చేయకపోవడానికి కేంద్రమే కారణమనే రీతిలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులు తాను ఇచ్చిన హామీలను మర్చిపోయి కేంద్రమే దోషి అనే రీతిలో ప్రచారం చేసే ప్రయత్నం, ప్రచారం మొదలు పెట్టినట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2022 / 02:32 PM IST
    Follow us on

    KCR Politics: కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడ్డారు.  తాజాగా  ఎస్టీ రిజర్వేసన్‌ రగడను తాజాగా తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.. గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటి నుంచి తప్పించుకునేందుకు ఎస్టీ రిజర్వేషన్‌ అంశాన్ని అమలు చేయకపోవడానికి కేంద్రమే కారణమనే రీతిలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులు తాను ఇచ్చిన హామీలను మర్చిపోయి కేంద్రమే దోషి అనే రీతిలో ప్రచారం చేసే ప్రయత్నం, ప్రచారం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

    -ఎందుకీ రగడ..
    2011 జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలో తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతం. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేతగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో తాను అధికారంలోకి వస్తే గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీలు, మైనార్టీలకు 12 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను గెలిపించి అధికారం అప్పగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన కేసీఆర్‌ హామీలను విస్మరించారు.

    Also Read: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ గొప్పతనం గురించి చెప్పిన ఆర్జీవీ

    -అవసరం లేకున్నా అసెంబ్లీలో తీర్మానం..
    రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు. సుప్రీం కోర్టు తీర్పు, రాజ్యాంగ్యం కల్పించిన హక్కుల ప్రకారం జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో రిజర్వేషన్లును మార్చుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ ప్రాతిపదినే తమిళనాడులో ఎస్సీ రీజర్వేషన్లు అమలవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో కూడా రాజ్యాంగ నిబంధన ప్రకారం 1986లో ఎన్టీ.రామారావు ప్రభుత్వం అప్పటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. దివంగత ముఖ్యమంత్రి కూడా ఇదే నిబంధన ప్రకారం మైర్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే మత ప్రాదిపదికన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మత ప్రాదిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా రిజర్వేషన్ల శాతం సవరించుకునే అవకాశం ఉంది. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వుల జారీ చేసి అమలు చేయవచ్చు. కానీ సీఎం కేసీఆర్‌ అలా చేయకుండా 2017 వరకు కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గిరిజన సంఘాలు రిజర్వేషన్ల కోసం ఒత్తిడి చేయడంతో హామీ నుంచి తప్పించుకునేందుకు 2017లో అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపుపై ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. రిజర్వేషన్ల బంతి కేంద్రం చేతులో ఉందని ప్రచారం చేసుకున్నారు.

    -2018లో పోడు హక్కుల హామీ..
    తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో గిరిజనుల ఓట్ల కోసం పోడు భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు కూడా అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చెప్పుకున్నారు. మరోమారు సీఎం కేసీఆర్‌ మాటలు నమ్మిన గిరిజనులు ఎస్టీ రిజర్వేషన స్థానాల్లో టీఆరఎస్‌ అభ్యర్థులనే గెలిపించారు. దీంతో పోడు హక్కులు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న హక్కు పత్రాల జారీకీ ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి కేవలం ఒకే ఒక్క సంతకంతో లక్షల మంది గిరిజనులకు పోడు హక్కుపత్రాలు ఇచ్చారు. మిగిలిన కొద్ది మందికి కూడా హక్కు పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తూ వచ్చిన కేసీఆర్‌ వానాకాలం అసెంబ్లీ సమావేశాల్లో పోడు హక్కు పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. తానే గిరిజన జిల్లాలో రెండు మూడు రోజులు ఉండి హక్కుపత్రాలు జారీ చేయిస్తానని ప్రకటించారు. ఈమేరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆరు నెలలు గడిచింది. హక్కు పత్రాల కోసం గిరిజనుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

    -తాజాగా రిజర్వేషన్ల రగడ..
    హక్కు పత్రాల హామీని ఏమార్చేందుకు తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్ల రగడ షురూ చేసింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తామని చెబుతున్న గులాబీ నాయకులు తాజాగా రిజర్వేషన్లపై కొత్త ప్రచారం మొదలు పెట్టారు. కేంద్రమే కావాలని రిజర్వేషన్లు జాప్యం చేస్తోందని, గిరిజనులను అవమానిస్తోందని ప్రచారం షురూ చేశారు. స్థానికంగా రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉనతో గిరిజనులను మళ్లీ మచ్చిక చేసుకునేందుకు కావాలనే రచ్చ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో గిరిజనుల్లో ఆ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలోనే రిజర్వేషన్లు తెచపైకి తెచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు.. కొడాలి నాని ఆన్ ఫైరింగ్

    Tags