కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ.. మరోవైపు బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన టైం ఆసన్నం కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ సమీక్షలతో బిజీ కానున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ రేపు అధికారులతో పలు భేటీల్లో పాల్గొనున్నారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కరోనాతో రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై అధికారులతో కేసీఆర్ సమీక్షిస్తారు. ఆదాయానికి అనుగుణంగా […]

Written By: NARESH, Updated On : November 7, 2020 12:54 pm
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ.. మరోవైపు బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన టైం ఆసన్నం కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ సమీక్షలతో బిజీ కానున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ రేపు అధికారులతో పలు భేటీల్లో పాల్గొనున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కరోనాతో రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై అధికారులతో కేసీఆర్ సమీక్షిస్తారు. ఆదాయానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, సవరించాల్సిన అంశాలపైనా చర్చిస్తారు.

Also Read: ధనిక రాష్ట్రం తెలంగాణ బడ్జెట్ ఇంతేనా?

అలాగే.. 2020–-21 బడ్జెట్ సమావేశాలపైనా ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష కూడా నిర్వహించనున్నారట. సాయంత్రం 4 గంటలకు యాదాద్రి ఆలయ పనులపై సమీక్షిస్తారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు.

Also Read: టీఆర్ఎస్ టార్గెట్: బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై జరిగిన సమీక్షలో వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్అండ్‌బీ అధికారులు, దేవాలయ ఈవో తదితరులు పాల్గొంటారు.