https://oktelugu.com/

ఇంతకీ జగన్ చేస్తున్నది తప్పా? ఒప్పా?

కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్‌ కాగలిగారు. ఇక ఇప్పుడు  కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు కేంద్రం కూడా అన్‌లాక్‌లో భాగంగా స్కూళ్ల తెరుచుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని చెప్పుకొచ్చింది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ దీంతో ఏపీలో స్కూల్స్‌ రీ ఓపెన్‌ చేసింది జగన్‌ ప్రభుత్వం. కానీ.. ఈ నిర్ణయంపై ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 11:57 AM IST
    Follow us on

    కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్‌ కాగలిగారు. ఇక ఇప్పుడు  కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు కేంద్రం కూడా అన్‌లాక్‌లో భాగంగా స్కూళ్ల తెరుచుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని చెప్పుకొచ్చింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    దీంతో ఏపీలో స్కూల్స్‌ రీ ఓపెన్‌ చేసింది జగన్‌ ప్రభుత్వం. కానీ.. ఈ నిర్ణయంపై ఓ వర్గం మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. ఈ వర్గం చేస్తున్న ప్రచారం స్కూళ్లు ఎందుకు తెరిచారా అనా.. లేక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనా అనేది తెలియకుండా ఉంది.

    Also Read: ఏపీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితా?

    అసలే కరోనా నేపథ్యంలో ఏ ప్రభుత్వం కూడా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోదు. పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టి స్కూల్స్‌ ఓపెన్‌ చేసేందుకు నిర్ణయించదు. ఇక్కడ జగన్‌ ప్రభుత్వం కూడా గుడ్డిగా ఏం స్కూల్స్‌ ఓపెన్‌ చేయలేదు. ఓ విద్యార్థి ఒక విద్యాసంవత్సరం కోల్పోవడం అంటే అది సామాన్యం విషయం కాదు. కరోనా కారణంగా జీవితంలో ఒక ఏడాదిని వృథాచేసుకోకూడదు అన్న ఆలోచనే కారణం అయ్యి ఉండొచ్చు కదా!

    Also Read: ధనిక రాష్ట్రం తెలంగాణ బడ్జెట్ ఇంతేనా?

    ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు పాఠశాలలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ కొత్తగా కరోనా కేసులు వచ్చినచోట కొన్ని రోజులపాటు సెలవులు ఇవ్వడం.. వారందరికీ ఆన్ లైన్ క్లాసులు అందేలా చూడటం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి స్కూల్‌లో పిల్లలకు శానిటైజేషన్ అలవాటు చేస్తున్నారు. 150 పనిదినాలతో ఈ ఏడాది సిలబస్ పూర్తి చేసి, తక్కువ సిలబస్ పైనే పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇది కచ్చితంగా మంచి ఆలోచనే. మీడియాలో వార్తలు వడ్డిస్తూ తల్లిదండ్రుల్లో అపోహలు కలిగించడం, వారిని టెన్షన్స్ పెట్టడం తప్పితే ఇంకా ఏమైనా ఉంటుందా అని ఆ మీడియానే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.