KCR vs BJP: బీజేపీ రూట్ లోనే కేసీఆర్.. అదే సెంటిమెంట్ తో ఎదురుదాడి?

KCR vs BJP: ప్రతిసారి గుళ్ళను నమ్ముకున్న కేసీఆర్ ఈసారి బీజేపీ దారిలోనే ‘దేశభక్తి’ని నమ్ముకున్నారు.దేశంలో ఇప్పుడు ఎవర్ గ్రీన్, పవర్ ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే అది ‘దేశభక్తి’, హిందుత్వనే. వీటిని రగిలించే బీజేపీ అధికారంలోకి వస్తోంది. అందుకే బీజేపీ బలాన్నే.. కేసీఆర్ తన అస్త్రంగా మలుచుకొని ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. యాదగిరిగుట్ట ను ఇల వైకుంఠపురం గా నిర్మించామని గొప్పలు పోయినా ఒక వానకు క్రెడిట్ మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. అప్పట్లో ఓ సభలో బొందుగాళ్ళని […]

Written By: Bhaskar, Updated On : June 16, 2022 6:18 pm
Follow us on

KCR vs BJP: ప్రతిసారి గుళ్ళను నమ్ముకున్న కేసీఆర్ ఈసారి బీజేపీ దారిలోనే ‘దేశభక్తి’ని నమ్ముకున్నారు.దేశంలో ఇప్పుడు ఎవర్ గ్రీన్, పవర్ ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే అది ‘దేశభక్తి’, హిందుత్వనే. వీటిని రగిలించే బీజేపీ అధికారంలోకి వస్తోంది. అందుకే బీజేపీ బలాన్నే.. కేసీఆర్ తన అస్త్రంగా మలుచుకొని ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. యాదగిరిగుట్ట ను ఇల వైకుంఠపురం గా నిర్మించామని గొప్పలు పోయినా ఒక వానకు క్రెడిట్ మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. అప్పట్లో ఓ సభలో బొందుగాళ్ళని చేసిన కామెంట్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంత దెబ్బ కొట్టిందో కేసిఆర్ కు తెలుసు. కాశ్మీర్ పైల్స్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత డ్యామేజీ చేశాయో కేసీఆర్ అండ్ కోకు తెలుసు. అందుకే ఈ సారి మలివిడతగా చేపట్టే ఉత్తరాది యాత్రలో చాలా జాగ్రత్తగా మసలు కుంటున్నారు. ఈసారి గుళ్ళు గోపురాలను వదిలిపెట్టి.. గాల్వాన్, పుల్వామా యాత్రకు శ్రీకారం చుట్టారు. బిజెపికి కలిసి వస్తున్న దేశభక్తి ట్రేడ్ మార్క్ రూట్ లో వెళ్తున్నారు.

KCR, MODI

ప్రజావ్యతిరేకత వ్యక్తమైన ప్రతిసారీ

తనపై ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతోందని తెలిసిన ఏ క్షణమైనా కూడా కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగుతారు. ఏదో ఒక విషయాన్ని తీసుకొని దాన్ని మీడియాకు లీక్ చేస్తారు. సొంత మీడియా ఎలాగూ ఉంది కాబట్టి ఓ వారం పాటు రచ్చరచ్చ అవుతుంది. ఈలోగా ఆయన ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్ కు ఎంట్రీ ఇస్తారు. రాహుల్ నుంచి స్థానిక బ్యూరో చీఫ్ ల వరకు అందర్నీ పిలుస్తారు. ఆ తర్వాత తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏ రిపోర్టర్ అయినా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే “నీకు తెలుసానువయా” అంటూ ఎదురుప్రశ్న వేశారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ మధ్య పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు వెళ్లి వచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు పత్తా లేరు. ఢిల్లీలోని ఆందోళనలో కన్నుమూసిన రైతు కుటుంబాలకు చెక్కుల ఇచ్చినా కెసిఆర్ కోరుకున్నంత మైలేజ్ రాలేదు. అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారుడితో చర్చలు జరుపుతారని ప్రగతి భవన్ ముందే లీక్ ఇచ్చినా అటువంటిదేమీ లేకుండా వెను తిరిగారు.

Also Read: Renuka Chowdhury Batti: ఈ కాంగ్రెసోళ్లు.. మరీ బరితెగించేశారా?

చేతిలో పైసా లేకున్నా

రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పల్లె ప్రగతి పెండింగ్ పనులకు బిల్లులు ఇచ్చే స్తోమత ఖజానా దగ్గర లేదు. మరోవైపు కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు కొండల్లా పెరిగిపోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బి ఆర్ ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అది ఇప్పట్లో తెర పైకి వచ్చే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ ప్రకటన మరికొద్ది రోజులు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు మద్దతు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆహ్వానం పలికినా ఆ గ్రూపులో కాంగ్రెస్ ఉందని బూచి చూపి గైర్హాజరయ్యారు.

KCR, MODI

సొంత మైలేజీ కోసం తాపత్రయం

సీఎం కేసీఆర్ ఏం చేసినా సొంత మైలేజీ కోసమే మాత్రమే చేస్తారు. నాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఇది పలుమార్లు నిరూపితం అవుతూనే ఉంది. ప్రస్తుతం బిజెపి అంటే ఉప్పు నిప్పులా ఉంటున్న కేసీఆర్ సమయం దొరికినప్పుడల్లా పీఎం మోడీ పై విరుచుకుపడుతున్నారు. ఈసారి మోదీ, అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉత్తరాది యాత్రను ఎంచుకున్నారు. కానీ ఈసారి బిజెపి రూట్ లోనే వెళ్తున్నారు. కమలనాథులకు ట్రేడ్ మార్క్ సింబల్ అయిన దేశభక్తిని ఈసారి కేసీఆర్ తన సొంతానికి వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే గాల్వాన్ లోయలో, పుల్వామా ఘటనలో అమరులైన సైనికుల కుటుంబాలకు చెక్కులు అందివ్వనున్నారు. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర పోరులో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ కుమార్ కన్నుమూశారు. అప్పట్లోనే ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ కోటి రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా ఆయన భార్యకు గ్రూపు వన్ అధికారి స్థాయి ఉద్యోగం ఇచ్చారు. అప్పట్లో గాల్వాన్ లోయ అమరులకు ఎటువంటి సహాయం చేస్తానని గాని, పుల్వామా అమరుల కుటుంబాలకు చెక్కులు ఇస్తానని గాని ప్రకటించకలేదు.

మోదీ తెలంగాణ కు వస్తుండటంతో

బిజెపి అగ్రనాయకులు మొత్తం హైదరాబాద్కు తరలి వస్తుండటంతో తన మైలేజి చెక్కు చెదరకుండా ఉండేందుకు గాల్వాన్ లోయ సైనిక మృతుల కుటుంబాలకు పరామర్శ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించిన అగ్నిపథ్ స్కీమ్ కు సంబంధించి వ్యతిరేక వార్తలు రా యిస్తున్నారు. బీజేపీ సైనికులకు ఏమీ చేయడం లేదని ప్రచారం చేయిస్తున్నారు.

జాతీయ మీడియాకు ఆహ్వానం

ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రం తరఫున దేశంలోని అన్ని ప్రముఖ జాతీయ దినపత్రికలకు ఇబ్బడిముబ్బడిగా జాకెట్ యాడ్స్ ఇచ్చారు. అదే సమయంలో అప్పు కోసం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రామకృష్ణ రావు ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. కానీ ఇవేవీ పట్టని కేసీఆర్ తన ప్రయోజనాలే ముఖ్యంగా గాల్వాన్ లోయ మృతుల కుటుంబాలకు పంపిణీ కార్యక్రమానికి జాతీయ మీడియాను ఆహ్వానించినట్లు తెలిసింది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కవరీ ఛానల్, తెలంగాణ లో ఈ ఎనిమిదేళ్లు చేపట్టిన కార్యక్రమాలపై ఎన్డీటీవీ లో ప్రైమ్ టైం బులిటెన్లు ప్రసారం చేయించుకున్నారు.

Also Read:Ram Gopal Varma Konda Movie: కొండా మురళి-సురేఖ చరిత్ర ఇదీ.. ఆర్జీవీ తన సినిమాలో ఏం చూపిస్తాడు?

Tags