KCR- Telangana Palapitta: రాజు తలుచుకుంటే… ఏదైనా తన ఇంటికి నడిచి రావాల్సిందే.. ఇది రాజుల కాలంనాటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలోనూ రాచరిక పాలనను తలపిస్తున్నారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు. తన నిర్ణయాలతో విమర్శలకు గురవుతున్నారు. అధికారులకు తలనొప్పులు తెస్తున్నారు. శుభాన్ని కలిగించే పాలపిట్టను దసరా రోజున చూడాలంటారు. ఇది తెలంగాణలో బలమైన ఆత్మీయ సెంటిమెంట్. దీని కోసం నేరుగా చూడని వారు సైతం ఫొటోలను షేర్ చేస్తూ పాలపిట్ట వల్ల కలిగే శుభాన్ని ఆశిస్తూ ఉంటారు. సెంటిమెంట్‌తో కూడిన ఆ పాలపిట్ట వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రికే కేసీఆర్‌కు తలనొప్ప తెచ్చిపెట్టింది. దసరా రోజు కేసీఆర్ చేసిన పని ఇప్పుడు ఆయనకు మాత్రమే కాకుండా, అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే శుభమని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఒక ఆచారం ఉంది. ఈ క్రమంలో దసరా రోజు పాలపిట్టను చూడడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పాలపిట్టను ప్రగతి భవన్‌కు తెప్పించుకున్నారు. ఇక ఇదే ప్రస్తుతం వివాదానికి కారణమైంది.

పంజరంలో రాష్ట్ర పక్షి..
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం మెప్పు పొందేందుకు.. దసరా రోజును సీఎం కేసిఆర్ మెప్పు పొందేందుకు ఏకంగా అటవీ శాఖ అధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. దాన్ని కేసీఆర్ దండం పెడుతుండగా ఫొటోలు తీసి అందరికి షేర్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది. పాలపిట్టను పంజరంలో బంధించిన విషయం తెలుసుకొన్న పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను పంజరంలో బంధించి అధికారులు తీసుకురావడం, సీఎం కేసీఆర్ పంజరంలో బంధించి ఉన్న పాలపిట్టను ప్రగతి భవన్‌కు తెప్పించుకుని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జంతు, పక్షుల ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరమని సీఎం కేసీఆర్ చేసిన పనిపై చర్చ జరుగుతుంది.
Also Read: KCR- Bharat Rashtra Samithi: తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్న కేసీఆర్.. విజయమో వీర స్వర్గమో!
వన్యప్రాణుల సంరక్షణా బోర్డు చైర్మన్‌గా ఉండి..
వన్యప్రాణుల సంరక్షణా బోర్డు తెలంగాణ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారు. ఆయనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సీఎం కేసీఆర్ వైల్డ్ లైఫ్ బోర్డుకు స్వయంగా చైర్మన్‌గా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి పాలపిట్టని బంధించి తన వద్దకు తెప్పించుకుని చూడడం ఎంత వరకు సమంజసమని జంతు, పక్షుల ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఆయన చర్యకు షాకయ్యామని చెప్తున్నారు.

ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లు..
తెలంగాణ రాష్ట్ర పక్షిని బంధించి రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఏం సందేశం ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ చట్టానికి చైర్మన్‌గా ఉండి, వన్యప్రాణులు విషయంలో ఈ తరహా ప్రవర్తన దేనికి నిదర్శనమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షిని పంజరంలో బంధించి కెసిఆర్, తన కుటుంబంతో పాటు చూడటం వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో చెప్పాలని వన్యప్రాణుల ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
పాలపిట్టను దర్శించుకున్న శ్రీరాముడికి విజయం..
లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయనను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పక్షి రోలర్ కుటుంబమునకు చెందినవి. భారత్, ఇరాక్, థాయిలాండ్ దేశాలల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే సీఎం కేసీఆర్.. దసరా రోజు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. జాతీయ రాజకీయాల్లో కూడా విజయం సాధించాలన్న కాంక్షతో… అధికారం ఉంది గదా, అంటూ ప్రగతి భవన్‌కు పాలపిట్టను తెప్పించుకోవడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు విరుద్ధమని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YCP- Non Political JAC: త్వరలో మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ.. వైసీపీ భారీ స్కెచ్
[…] […]
[…] […]