KCR: నిరుద్యోగులను బీజేపీ నుంచి ఒక్క దెబ్బతో వేరు చేసిన కేసీఆర్

KCR:  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 ఏళ్లు.. అలుపెరగని పోరాటమే.. తెలంగాణ ఉద్యమం ఉదృతమైన 2009 నుంచి తెలంగాణలో ఉద్యోగాల ప్రకటన నిలిచిపోయింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ ఊసే ఎత్తలేదు. తెలంగాణ యువత అంతా స్వరాష్ట్రం కోసం బరిగీసి నిలబడి ‘జైతెలంగాణ’ నినాదాలు చేశారు. చదువులున్నీ పక్కనపెట్టి తెలంగాణ కోసం పోరాడారు. దీంతో వారి కల ఫలించింది. తెలంగాణ సిద్ధించింది. 2014లో తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యారు. మొదట నీళ్ల గోస […]

Written By: NARESH, Updated On : March 9, 2022 6:13 pm

KCR

Follow us on

KCR:  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 ఏళ్లు.. అలుపెరగని పోరాటమే.. తెలంగాణ ఉద్యమం ఉదృతమైన 2009 నుంచి తెలంగాణలో ఉద్యోగాల ప్రకటన నిలిచిపోయింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ ఊసే ఎత్తలేదు. తెలంగాణ యువత అంతా స్వరాష్ట్రం కోసం బరిగీసి నిలబడి ‘జైతెలంగాణ’ నినాదాలు చేశారు. చదువులున్నీ పక్కనపెట్టి తెలంగాణ కోసం పోరాడారు. దీంతో వారి కల ఫలించింది. తెలంగాణ సిద్ధించింది.

KCR

2014లో తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యారు. మొదట నీళ్ల గోస తీర్చాడు. అనంతరం నిధులతో అభివృద్ధిని పంచాడు. అయితే ఉద్యమంలోని రెండు ప్రధాన అంశాలు నెరవేరినా నియామకాలు మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ ఏర్పడి 7 ఏళ్లు గడిచిపోయాయి. అన్ని వర్గాల్లో కేసీఆర్ అంటే కాస్తో కూస్తో అనుకూలత ఉన్నా నిరుద్యోగులు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నిరుద్యోగులంతా బీజేపీ పంచన చేరి దుబ్బాక, హుజూరాబాద్ లలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారు.

Also Read: Telangana Budget Session 2022: కేసీఆర్ నిర్వాకంపై ఆ ఎమ్మెల్యేల న‌ల్ల బ్యాడ్జీల‌తో నిర‌స‌న‌

రెండు సార్లు తెలంగాణలో అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ కు మూడో సారి గెలిచేందుకు చాలా కష్టాలున్నాయి. అందులో నిరుద్యోగులు అడ్డంగా నిలబడుతున్నారు. వారిని కూల్ చేయనిదే కేసీఆర్ గెలవడం అసాధ్యం. అందుకే తెలివిగా 80వేలకు పైగా ఉద్యోగాలు వేసిన కేసీఆర్ వారిని చదువుల వైపు మళ్లించారు. ఇక వాళ్లంతా బీజేపీ వెంట తిరగక. ఆ పార్టీలో యాక్టివ్ గా ఉండరు. సో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన అంతిమంగా బీజేపీకే పెద్ద దెబ్బ.

ఇక కేసీఆర్ తెలివిగా ఉద్యోగ నియమకాల్లో వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకూ.. దివ్యాంగులకు 55 ఏళ్లకు, ఓసీలకు 44 ఏళ్లకు పెంచారు. తద్వారా తెలంగాణ ఉద్యమంలో నాడు పాలుపంచుకున్న యువతకు అర్హత కల్పించారు. దీంతో వారంతా తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టి రాజకీయాలు వదిలేస్తారు. ఈ పరిణామం కేసీఆర్ కు కలిసి వచ్చి గెలుస్తారు. ఈ ప్లాన్ తోనే కేసీఆర్ ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: Poonam Kaur Sensational Comments: నా జీవితాన్ని రావణులు చెడగొట్టారు – పూనమ్ కౌర్