కేసీఆర్ వరాలు సరే.. అమలుపైనే అనుమానం

  తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటింది. రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్ల అవలీలగా గెలిచిన టీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో జెండా పాతడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఊపు గులాబీ జెండాకు వాపు అన్నట్లుగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సాగుతోంది.  ఈ నేపథ్యంలో నగరవాసులను ఆకట్టుకోవడానికి  కేసీఆర్ ఎన్నడూ ప్రకటించినంతగా భారీగా వరాలు ప్రకటించారు. ప్రతి ఒక్కరిని ద్రుష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి సాయం చేస్తానని తెలిపారు. . అయితే గత అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : November 24, 2020 12:17 pm
Follow us on

 


తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటింది. రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్ల అవలీలగా గెలిచిన టీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో జెండా పాతడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఊపు గులాబీ జెండాకు వాపు అన్నట్లుగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సాగుతోంది.  ఈ నేపథ్యంలో నగరవాసులను ఆకట్టుకోవడానికి  కేసీఆర్ ఎన్నడూ ప్రకటించినంతగా భారీగా వరాలు ప్రకటించారు. ప్రతి ఒక్కరిని ద్రుష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి సాయం చేస్తానని తెలిపారు. . అయితే గత అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో కొన్ని మాత్రమే అమలు చేశారు. మరి ఇప్పడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా..? అనే చర్చ సాగుతోంది.

Also Read: మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?

హైదారాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ మెనిఫెస్టోను నిన్న కేసీఆర్ ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ వాసులను దృష్టిలో పెట్టుకొని భారీగా వరాలిచ్చారు. నగరవాసులు 20 లీటర్ల వరకు నీటిని వాడుకుంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఈ విధానంతో 98 శాతం మందికి లబ్ధి జరుగుతుందని చెప్పారు. సెలూన్లు, ధోభీఘాట్ కు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇది డిసెంబర్ లో అమలవుతుందని చెప్పారు.

ఇక మేనిఫెస్టో విడుదల కు ఒకరోజు ముందు కలిసిన సినీ పెద్దలకు కేసీఆర్ సడలింపులు భారీగానే ఇచ్చారు. రూ 10 కోట్ల లోపు సినిమా తీస్తే జీఎస్టీ రీయంబర్స్ మెంట్ ఉంటుందన్నారు. సినిమా పరిశ్రమల్లోపనిచేసే కార్మికులకు మిగతా వారికి వర్తించే రేషన్, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరను యజమానులు నిర్ణయించుకోవచ్చన్నారు.

Also Read: సినిమా సడలింపులు సరే.. టికెట్ రేటు తగ్గించరా.?

మరోవైపు రానున్న రోజుల్లో హైదరాబాద్ ను మరింత అభివ్రుద్ధి చేసే దిశగా ముందుకెళ్తామన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెట్రో రైలును ప్రారంభించామని, మరో 90 కిలోమీటర్ల మేర దాని పొడవు పెంచుతామన్నారు. నగరంలో సిటిజన్ క్లబ్ లు, ఉచిత జిమ్ లు, స్కైవాక్లు, సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎల్ ఆర్ఎస్ విషయంలో వివాదాస్పద భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి క్రమబద్దీకరిస్తామన్నారు.

మొత్తంగా కేసీఆర్ వరాలను చూస్తే ఎలాగైనా గ్రేటర్ లో జెండా పాతడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతిపక్ష బీజేపీ పార్టీ ఇస్తున్న పోటీతో టీఆర్ఎస్ తరుపున పోటీలో ఉన్న నాయకులు సైతం భయంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే హామీల అమలకు కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకుంటాడా..? లేక అంతకుముందు మాదిరిగానే దాటవేస్తాడా..? అనే అనుమానం ప్రజల్లో లేకపోలేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్