హరీష్‌కు కేసీఆర్  గిఫ్ట్‌.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో లేడీ సూపర్‌‌ స్టార్‌‌ అయిన విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఎప్పుడూ సీఎం కేసీఆర్‌‌, టీఆర్‌‌ఎస్‌ పార్టీపై విరుచుకుపడే ఆమె.. తాజాగా.. మరోసారి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు హరీష్‌, కేటీఆర్‌‌లను టార్గెట్‌ చేసింది. ఏకంగా హరీష్‌రావుకు ఆయన మామ కేసీఆర్‌‌ ఊహించని షాక్‌ ఇచ్చినట్లు చర్చ నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా హరీష్ చెమటోడ్చి […]

Written By: NARESH, Updated On : November 2, 2020 1:32 pm
Follow us on

టాలీవుడ్‌లో లేడీ సూపర్‌‌ స్టార్‌‌ అయిన విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఎప్పుడూ సీఎం కేసీఆర్‌‌, టీఆర్‌‌ఎస్‌ పార్టీపై విరుచుకుపడే ఆమె.. తాజాగా.. మరోసారి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు హరీష్‌, కేటీఆర్‌‌లను టార్గెట్‌ చేసింది. ఏకంగా హరీష్‌రావుకు ఆయన మామ కేసీఆర్‌‌ ఊహించని షాక్‌ ఇచ్చినట్లు చర్చ నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా హరీష్ చెమటోడ్చి పనిచేస్తున్నారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, తన తనయుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్‌‌ రంగం సిద్ధం చేశాయి. ఈ వాదనకు బలం చేకూర్చేలా.. మొదటిసారి కేసీఆర్ నోట సీఎం పదవికి రాజీనామా అనే మాట బయటకు వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కేసీఆర్ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు విజయశాంతి. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదన్నారు. అంతేకాదు తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కేసీఆర్‌‌ బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.

ప్రభుత్వంపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఎప్పుడైనా విరుచుకుపడే కేసీఆర్‌‌.. ఇప్పుడు ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న లేవనెత్తారు. ఓవైపు హరీష్ రావు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు విజయశాంతి. ఈ ప్రకటన బీజేపీ నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావుకు కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. మొత్తం మీద కేసీఆర్ రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత హరీష్ రావుకు ఆయన మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోందన్నారు. ఇప్పుడు విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక విధంగా హాట్‌ టాపిక్‌లా మారాయి.